Advertisement
నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టిడిపి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తో కలిసి తారకరత్న కొద్దిసేపు జనాలతో మమేకం అవ్వడానికి నడవడం మొదలుపెట్టాడు. అలా కొద్దిసేపు వెళ్ళగానే ఆయన స్పృహతప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్సకోసం పదిమంది వైద్యబృందంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. కాగా ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
Advertisement
బెంగుళూరు నారాయణ హృదయాలయాలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్ పైనే ట్రీట్మెంట్ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఉన్నారు తారకరత్న. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటల వరకు వేచి చూడాల్సిందేనని బంధువులు పేర్కొంటున్నారు. తారకరత్నను చూసేందుకు ఇవాళ బెంగళూరు వెళుతున్నారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. వీరిద్దరితోపాటు కుటుంబ సభ్యులు కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు వెళ్ళనున్నారు.
Advertisement
బెంగళూరు నారాయణ హృదయాలయకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రానున్నారు. నిన్న తారకరత్నను చూసేందుకు చంద్రబాబు, నందమూరి కుటుంబసభ్యులు వచ్చారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితిని కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నారాయణ హృదయాలయాలో కార్డియాలజిస్టులు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులతో చికిత్సను అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఎప్పటికప్పుడు డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారు.
READ ALSO : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ గమనించారా..?