Advertisement
నందమూరి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. హీరో నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ను చూసేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో అప్డేట్ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలేనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించింది. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలేనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలేనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటు నోరు, అన్నవాహిక కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్ సంభవిస్తుంది.
Advertisement
మెలేనా కారణాలు: ఎగువ జీర్ణశయంతర మార్గం దెబ్బతినడం. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్తనాళాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలేనా సంభవిస్తుంది.
Advertisement
మెలేనా లక్షణాలు: మెలేనా వల్ల మలం నల్లగా బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. హిమటోచేజియ స్థితికి మెలేనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలేనా వల్ల శరీరంలో రక్తస్థాయి తగ్గిపోతుంది. అనిమీయాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రక్తం తక్కువగా పోయే స్థితిలో చిన్న ప్రేగులో రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతంగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి.
READ ALSO : అప్పుడు తొడ కొడితే ట్రైన్ వెనక్కి, ఇప్పుడు వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!