Advertisement
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 ప్రపంచ కప్ ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ప్రపంచకప్ లో ప్రత్యర్ధులను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకుని పెట్టుకున్నాయి. ఇలాంటి సమయంలోనే టీం ఇండియాను గాయాల బెడద వెంటాడుతుంది.
Advertisement
READ ALSO : మరోసారి జగన్ సీఎం కాకపోతే.. గెలిచినా రాజీనామా చేస్తా !
టీ 20 ప్రపంచ కప్ ముంగిట టీం ఇండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే రవీంద్ర జడేజా, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఈ మెగా టోర్నీకి దూరం కాగా, ఇప్పుడు ప్రపంచ కప్ స్టాండ్ బై బౌలర్లలో ఒకడిగా ఉన్న దీపక్ చాహార్ సైతం గాయపడ్డాడు. ఇది ఇలా ఉండగా, టీమిండియా ఇప్పటివరకు టి20 ప్రపంచ కప్ లో సాధించిన రికార్డుల వివరాలు తెలుసుకుందాం.
# అతిపెద్ద గెలుపు-2012లో శ్రీలంక పై 90 పరుగుల తేడాతో గెలుపు.
# ఉత్కంఠ భరత విజయం-2012లో దక్షిణాఫ్రికాపై 2016లో బంగ్లాదేశ్ పై ఒక్క పరుగు తేడాతో భారత్ విజయం.
Advertisement
# అత్యధిక సిక్సర్లు-యువరాజ్ (33 సిక్సర్లు).
# అతిపెద్ద స్కోరు-2007లో ఇంగ్లాండ్ పై 218/4 చేసిన టీమిండియా, ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో గెలిచిన భారత్.
# అత్యధిక బ్యాటింగ్ యావరేజ్-విరాట్ కోహ్లీ (21 మ్యాచ్ లు-19 ఇన్నింగ్స్ లు-845 పరుగులు-76.81 యావరేజ్).
# అత్యధిక స్ట్రైక్ రేట్-కే ఎల్ రాహుల్ (152.75).
# అత్యధిక వికెట్లు-రవిచంద్రన్ అశ్విన్ (18 మ్యాచ్ లలో 26 వికెట్లు).
# అత్యధిక వ్యక్తిగత స్కోరు-సురేష్ రైనా (2010లో దక్షిణాఫ్రికా పై 101 పరుగులు) .
# అత్యధిక పరుగులు-రోహిత్ శర్మ (33 మ్యాచ్లలో 847 పరుగులు)
#అత్యధిక హాఫ్ సెంచరీలు-విరాట్ కోహ్లీ(10) .
READ ALSO : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి నేనే !