Advertisement
ఇండస్ట్రీలో ఒక లెవెల్ కి వెళ్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ సినీ జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పవచ్చు. అక్కడితో ఆగకుండా ఆయన మరణం వరకు వెళ్లింది. ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో మొదటిసారి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చిత్రం సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. ఈ మూవీ థియేటర్లలో దాదాపుగా 100 రోజులకు పైగానే ఆడింది అని చెప్పవచ్చు.
Advertisement
ఈ మూవీ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా నువ్వు నేను, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అయితే జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉదయ్ కిరణ్ చావుకు చిరంజీవికి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం బయట పెట్టాడు తేజ. ఈ హీరోను పరిచయం చేసింది ఈ దర్శకుడే. ఉదయ్ కిరణ్ అమాయకుడని, చాలా మంచి వాడని ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోలేక చచ్చిపోయాడని చెప్పాడు తేజ.
Advertisement
ఇక్కడి మనుషులను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదన్నాడు ఈ దర్శకుడు. ఇక ఉదయ్ కిరణ్ మానసిక స్థితి కూడా బాగోలేదని వాళ్ళింట్లో అన్నయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు తేజ. దాంతో పాటు ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తనకు తర్వాత తెలిసిందని చెప్పాడు తేజ. వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కారణాలే ఈ కుర్రాడికి సమస్యలు తెచ్చాయని, ఔనన్నా కాదన్నా సినిమాకు ముందే ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఉదయ్. ఈ విషయాన్ని కూడా చెప్పాడు తేజ. అప్పుడే ఆపి ఆయనతో సినిమా చేశానని, అయితే ఆ తర్వాత మాత్రం కుదరలేదని చెప్పాడు దర్శకుడు తేజ. ఏదేమైనా కూడా ఓ మంచి మనిషిని కోల్పోవడం బాధ కలిగించిందని చెప్పాడు తేజ. అంతేగాని ఓ అగ్ర నటుడి వల్లే ఉదయ్ చనిపోయాడనేది మాత్రం ఫేక్ అంటూ కొట్టి పారేశాడు ఈయన.
Read also : Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు నవంబర్ 06 నుంచి 12 నవంబర్ 2022 వరకు