Advertisement
తెలంగాణతో పాటు మిగతా నాలుగు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి మదిలో ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు అధికారంలోకి వస్తారు..? ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ ఎక్కువ మేజార్టీ సాధిస్తారు ? అనే సందేహాలు అందరికీ తెలుస్తాయి. ఈ సందేహాలను తీర్చడానికి కల్ట్ నెర్డ్స్ ఐటీ సొల్యూషన్ కంపెనీ ముందుకు వచ్చింది.
Advertisement
ముఖ్యంగా ఒక్కసిరా చుక్కా లక్ష మెదళ్ల కదళిక అన్నారు కాళోజీ. దీనిని ఆదర్శంగా తీసుకొని కల్ట్ నెర్డ్స్. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. 50 శాతానికి మించి దాటడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కల్ట్ నెర్డ్స్ ఓటర్లలో అవగాహన కలిగిస్తోంది. ప్రధానంగా ఓట్ ఫర్ ఇంపాక్ట్ అంటూ కల్ట్ నెర్డ్స్ ఓ ప్రత్యేక వీడియో రూపొందించింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని ఓ సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రస్తుతం వీళ్లు రూపొందించిన వీడియో వైరల్ అవుతోంది. ఓట్ ఫర్ ఇంపాక్ట్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో సెల్పీలు, ఫోటోలను పోస్టు చేయాలని ఓటర్లను సూచించింది కల్ట్ నెర్డ్స్. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ కంపెనీ తీసుకున్న చొరువపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలా మంచి ఐడియా అని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. CultNerds it Solutions అనేది డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కంపెనీ.. హైదరాబాద్ ఐటీ భాండాగారం అయినటువంటి గచ్చిబౌలిలో ఈ సంస్థ ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలకు ఐటీ సర్వీసులు.. మార్కెటింగ్ సర్వీసులను అందిస్తోంది కల్ట్ నెర్డ్స్. ముందు ముందు మరిన్నీ సర్వీసులను అందించేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఇకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓట్ ఫర్ ఇంపాక్ట్ వీడియోని చూసేయండి.