Advertisement
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఆలయాలని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తిరుమల లడ్డూ వివాదం గురించి అందరికీ తెలిసిందే. లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతగానో మనోవేదనకి గురయ్యారు. ఆలయాలని శుద్ధి చేసే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తెర లేపారు మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకొని ఏడుకొండల వారిని దర్శించుకున్నారు.
Advertisement
చంద్రబాబు కూడా వైసీపీపై దుమ్మెత్తి పోసినంత పని చేశారు. తిరుమల శ్రీవారిని అపవిత్రం చేశారని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో లడ్డూలను తయారు చేశారని.. ల్యాబ్ లో కూడా అదే నిరూపితమైందని చెప్పారు. వారం రోజుల పాటు రచ్చ రచ్చగా మారిన తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణిగింది.
Advertisement
Also read:
లడ్డులో జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యి వాడారని.. నిరూపితం కాకముందే రాజకీయాల్లో ఎలా ప్రకటనలు చేస్తారని బాబు పై ఫైర్ అయ్యింది. ఈ లడ్డు వివాదాన్ని తెలంగాణలో ఏ నేతలు కూడా పెద్దగా పట్టించుకోనట్లు కనపడింది. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా వార్ అయితే నడిచింది. ఇక్కడి నేతలు మాత్రం ఆ వివాదం గురించి స్పందించలేకపోయారు. లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా నిరూపితం కాకపోవడంతో ఎందుకు ఆ గొడవ నెత్తిన వేసుకున్నారు అనే అభిప్రాయం ఇక్కడి నేతల్లో కనపడినట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!