Advertisement
తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పరిపాలనకు ప్రజలు గుడ్ బాయ్ చెప్పారు. తెలంగాణాలో ముగిసిన ఎన్నికల హడావిడి త్వరలోనే ఏపీలో మొదలు కాబోతోంది. అయితే.. తెలంగాణ లో ఎన్నికల ఫలితాలు ఎపి ప్రజలపై కూడా ప్రభావం చూపించనున్నాయా? తెలంగాణ ఎన్నికలు ఏపీకి ఏ సందేశం ఇస్తున్నాయి? అనేది ప్రస్తుతం చర్చగా మారింది. తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు ఆంధ్ర లో మూడు ప్రధాన పార్టీలకు హెచ్చరిక ఇచ్చినట్లయింది.
Advertisement
వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలు ఎన్నికల కోసం మరింత శ్రద్ధగా సిద్ధం అవ్వాల్సి ఉంది. కేసీఆర్ ఓటమితో జగన్ బలం తగ్గిందని.. టీడీపీ కె కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని టీడీపీ పార్టీ రాజకీయ నాయకులూ సంతోషపడిపోతున్నారు. కానీ, ఇక్కడ వాస్తవం ఏమిటంటే.. టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ కె మద్దతు ఇచ్చారు. ఏపీ మూలాలు ఉన్న కొన్ని చోట్ల వీరే కాంగ్రెస్ తరపున తమ ప్రచారాన్ని కొనసాగించారు.
Advertisement
ఆంధ్ర మూలాలు ఎక్కువ ఉన్న ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, కుకట్ పల్లి, శేరిలింగం పల్లి, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో టీడీపీ నేతలు ప్రచారం చేసినా.. సిబిఎన్ అరెస్ట్ నేపథ్యంలో ఈ నేతల హడావిడి మరుగున పడిపోయింది. మరోవైపు తెలంగాణాలో జనసేన బిజెపితో కలిసి పోటీ చేసింది. కానీ, పవన్ వేసిన ఎనిమిది డిపాజిట్లకు ఓట్లు పడలేదు. పవన్ హాజరు అయ్యే బహిరంగ సభలకు ఎక్కువగానే అభిమానులు వస్తున్నప్పటికీ ఓట్లు మాత్రం పడలేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కి కూడా పవన్ కి పాలిటిక్స్ లో ఉన్న పొజిషన్ గురించి అర్ధం అవుతూ ఉన్నది. దీనితో తెలంగాణాలో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read More:
ఈ 15 సినిమాల్లో హీరోయిన్స్ కంటే కూడా పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్స్ ఫేమస్ !
Pindam OTT Release Date and OTT Platform, Digital Rights, When and Where to Watch