Advertisement
1. తరుణ్
Advertisement
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన హీరో తరుణ్.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. లవర్ బాయ్ అన్న ఇమేజ్ ను సంపాదించుకున్న తరుణ్… 2014 సంవత్సరంలో వేట అన్న సినిమా చేసి నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని మల్లీ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం సినిమాలు ఏమి చేయడం లేదు.
2. వేణు
1999 సంవత్సరంలో స్వయంవరం సినిమా తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు వేణు. మొదటి సినిమానే హిట్ కావడంతో వేణు కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో లాంటి సినిమాల్లో నటించి జనాలకు చేరువయ్యాడు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడం లేదు.
3. ఆర్యన్ రాజేష్
టీవీని సత్య నారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్.. హాయ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు ఆర్యన్ రాజేష్. ఆ తర్వాత ఎవడి గోల వాడిదే, ఆడంతే అదోటైపు, నువ్వంటే నాకిష్టం మరియు అనుమానాస్పదం సినిమాలో నటించాడు. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు కి ఆర్యన్ రాజేష్ పరిమితమయ్యాడు.
Advertisement
4. రవి కృష్ణ
7/G బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి వచ్చాడు. మొదటి సినిమాతోనే అలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకుని సాహసం చేసినా… సినిమా ఒక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందటం, యూత్ కు తొందరగా కనెక్ట్ కావడం తో మంచి హిట్ అందుకున్నాడు.
5. తారకరత్న
2002 సంవత్సరం లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో తెలుగు పరిశ్రమ లోకి అడుగుపెట్టాడు తారకరత్న. ఆ తర్వాత అమరావతి సినిమాలో ఆయన చేసిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఎంతో పేరు వచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు ఈ నందమూరి హీరో.
Also Read: దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?