Advertisement
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తేరకెక్కిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ఆసిన్. 2003లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆసిన్. నిజానికి ఈమె మలయాళీ. అదే కేరళకు చెందిన అమ్మాయి. కానీ అ’మ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో మలయాళీ అమ్మాయిగా చూపించాడు పూరి. ఈ విషయంపై అప్పట్లో ఫన్నీ సెటైర్లు చాలానే వచ్చాయి.
Advertisement
ఇక అటు తర్వాత నాగార్జునతో తేరకెక్కించిన ‘శివమణి’ సినిమాలో కూడా ఆసిన్ కు ఛాన్స్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ మూవీ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. దీంతో బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహ’, వెంకటేష్ తో ‘ఘర్షణ’, పవన్ కళ్యాణ్ తో ‘అన్నవరం’, ప్రభాస్ తో ‘చక్రం’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఆసిన్ కు తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ‘గజిని’ సినిమా ఈమెకి ఎనలేని ఖ్యాతిని తెచ్చి పెట్టింది.
Advertisement
ఇదిలా ఉండగా, తన కెరీర్ మంచి పీక్స్ స్థాయిలో ఉన్న సమయంలో 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. రాహుల్ శర్మ, ఆసిన్ జంటకు ఒక పాప కూడా ఉంది. మొదటినుంచి ఆసిన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆమెకు గాని, ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ గాని, బయటకు కనిపించవు. కానీ తాజాగా ఇప్పుడు ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఆసిన్ మునుపటికన్నా ఇంకా ఎక్కువ గ్లామరస్ లుక్ తో కనిపిస్తూ అందరి చూపులను ఆకర్షించింది.
Read Also : పెళ్లయిన స్త్రీలు ఈ పనులు చేయకూడదట తెలుసా!