Advertisement
నటులవ్వడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ నటులు అవ్వలేరు. పైగా లక్ కూడా కలిసి రావాలి. చాలామంది ఇండస్ట్రీలోకి పెద్ద స్టార్ అయిపోవాలని వస్తూ ఉంటారు కానీ అందరికీ అంత అవకాశం రాదు. ఇదివరకు అయితే కేవలం సినిమాల్లో మాత్రమే నటులు కనపడేవారు ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరగడంతో నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నారు. తాజా ఫొటోస్ ని చిన్ననాటి ఫోటోలని ఇలా ఎవరికి నచ్చిన ఫొటోస్ ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో యాక్టివ్ గా కూడా ఉంటారు.
Advertisement
ఒక్కొక్కసారి కొంతమంది ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది నటులకి పెద్ద పెద్ద పాత్రలు రాక చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఇక ఈమె గురించి చూసేస్తే.. తెలుగు నాట పుట్టిన ఈ భామ మలయాళ పరిశ్రమలో ఒకప్పుడు పెద్ద హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఎవరంటే లక్ష్మి లహరి అలియాస్ లక్ష్మి శర్మ. ఈమె పేరు చెప్తే ఎవరికీ తెలీదు కానీ ఇంద్ర సినిమాలో చిరంజీవి మేనకోడలు నందినిగా చేసింది కదా అంటే అందరూ గుర్తుపట్టేస్తారు.
Advertisement
తెలుగులో ఈమె చాలా సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపు రాలేదు. దానితో ఈమె మలయాళ పరిశ్రమ కి వెళ్ళిపోయింది. అమ్మో ఒకటో తారీకు సినిమాలో ఎల్బీ శ్రీరామ్ చిన్న కూతురుగా కూడా ఈమె నటించింది. అలానే ఈమె సారీ నాకు పెళ్లయింది, ఆరుగురు పతివ్రతలు వంటి సినిమాల్లో కూడా నటించింది. మమ్ముట్టి తో పలన్కు సినిమా చేసింది. ఇలా ఈమె మలయాళ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా ఈమె మలయాళ సినిమాల్లో నటిస్తూనే ఉంది. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో ఈమె ఆడు జీవితం సినిమాలో నటిస్తోంది ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది.
Also read:
టైర్ల కింద నిమ్మకాయలని పెట్టి ఎందుకు తొక్కించాలి..? కారణం ఏమిటి అంటే..?
శనివారం నాడు వీటిని చూస్తే.. శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది.. కష్టాలన్నీ పోతాయి కూడా..!