Advertisement
సాధారణంగా మనం ఒక డ్రెస్ ని ఉతకకుండా రెండు, లేదా మూడు రోజులు వేసుకుంటాం. మహా అయితే నాలుగు రోజులు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం రెండేళ్లపాటు ఉతకకుండా ఉన్న ఓ షర్ట్ ని వేసుకున్నారు. ఆయన ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు మన మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు భరించి, జరిగిన అవమానాలను చాలెంజింగ్ గా తీసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ కేవలం తన నటనతోనే అందరినీ మెప్పించి కొద్ది రోజులలోనే స్టార్ హీరోగా మారిపోయారు.
Advertisement
Read also: హీరోలతో తప్పు చేయించి క్లాస్ పీకడం అవసరమా..?
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ అంచనాలతో తీసిన చిత్రం అంజి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయింది. ఈ చిత్రం దాదాపు 7 ఏళ్ల పాటు ఆగుతూ సాగుతూ పడుతూ లేస్తూ మొత్తానికి పూర్తి అయింది. 1997 లోనే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. అప్పట్లోనే 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 2004లో విడుదల అయింది. ఈ సినిమాకు పరిచూరి బ్రదర్స్ మాటలు రాశారు. నిజానికి అంజి సినిమా చేయడం దర్శకుడికి ఇష్టం లేదట.
Advertisement
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మాత్రం చిరంజీవితో ఓ భారీ గ్రాఫికల్ సినిమా చేయాలని పట్టుదలతో అంజి వచ్చేలా చేశారట. అయితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ని దాదాపు రెండేళ్ల పాటు చిత్రీకరించారు. అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశంలో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచారట. ఆ సన్నివేశంలో మాసిన షర్టుతో కనిపించడానికి ఇలా చేశారట. ఈ విషయాన్ని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంత పెద్ద హీరో అయినా కూడా కొత్త హీరోలా అంజి కోసం కష్టపడ్డారని, కానీ ఈ చిత్రం ఫలితం నిరాశపరిచిందని చెప్పారు.
Read also: మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణ గారిని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?