Advertisement
చాలామంది వ్యక్తులకు మంచి, చెడు అలవాట్లు రెండు ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండు ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా, సినిమాలో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం అలవాటును మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తర్వాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం.
Advertisement
#విజయ్ దేవరకొండ:
‘గీత గోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇతనికి వాస్తవానికి సిగరెట్ తాగే అలవాటు లేదు. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో సిగరెట్ తాగాల్సి వచ్చింది.
#అల్లు అర్జున్:
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ఇతనికి కూడా ఎలాంటి బ్యాడ్ అలవాటు లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో అయిన బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా మారాడు. ఇతను కూడా సన్నాఫ్ సూర్య సినిమాలో సిగరెట్, స్మోకింగ్ చేయాల్సి వచ్చింది.
Advertisement
#మహేష్ బాబు:
టాలీవుడ్ క్యూట్ బాయ్ గా పేరు ఉన్న మహేష్ బాబుకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. కానీ, సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్మోకింగ్ చేయడం మానేశారు. ప్రస్తుతం కంప్లీట్ గా స్మోకింగ్ చేయడం లేదు.
#విజయ్:
సౌత్ ఇండియన్ టాప్ హీరోగా కొనసాగుతున్న విజయ్ కు ఓ బ్యాడ్ అలవాటు ఉంది. ఖరీదైన కార్లు ఉన్న విజయ్ రాష్ డ్రైవింగ్ చేస్తాడన్న పేరు ఉంది. అంతేకాకుండా డ్రైవింగ్ విషయంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.
#ధనుష్:
తమిళంతో పాటు తెలుగు, హిందీ ఇండస్ట్రీలకు పరిచయమైన ధనుష్ కు వాస్తవానికి శాకాహారి. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయట.
ఇవి కూడా చదవండి: మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే?