Advertisement
ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగాలి సినీ పరిశ్రమకు చెందిన నటి ఆండ్రీలా శర్మ నవంబర్ 20వ తేదీన గుండెపోటు కారణంగా మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ భారీ నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ చివరికి మరణాన్ని జయించలేకపోయింది. 24 ఏళ్ల అతి చిన్న వయసులోనే మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ నెల 15వ తేదీ నుండి ఆమెకు పలుమార్లు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ తర్వాత ఆమెకు వైద్యులు సిపిర్ కూడా చేశారు.
Advertisement
Advertisement
ఆ తర్వాత అర్ధరాత్రి ఆమెకు మరో కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని, దాని కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆండ్రిలాకు చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ఆమె మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. పశ్చిమబెంగాల్లోని బెర్హంపూర్ లో అండ్రిలా జన్మించింది. జముర్ తో టెలివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత మహాపీట్ తారాపీట్, జిబోనే జ్యోతి, జియోన్ కతి వంటి షోలతోపాటు.. అమీ దీదీ నెంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాలలోనూ నటించింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె అర్ధంతరంగా మరణించడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక ఆండ్రీలాకు అన్నివేళలా తోడు నీడగా ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ సభ్యసాచి చౌదరి.. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
ఆమె ఆసుపత్రిలో ఉండగానే సభ్యసాచి చౌదరి.. ఆండ్రీల బ్రతకాలని ప్రార్థించండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులను కోరారు. కానీ అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. ఇక ఆండ్రీలా అంత్యక్రియలకు హాజరైన ప్రియుడు సభ్యసాచి .. ఆమె మృతదేహం వద్ద మోకాళ్లపై కూర్చుని ఆమె పాదాలకు ముద్దు పెట్టడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. ఆమె పాదాలను ముద్దాడి ప్రియురాలికి చివరి వీడ్కోలు పలికారు. అంతేకాకుండా సభ్యసాచి తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేశారు. చివరిసారిగా సోషల్ మీడియా ఖాతాలో తన ప్రియురాలు త్వరగా కోలుకోవాలని కోరుకోండి అంటూ అభిమానులను కోరిన సభ్యసాచికి అదే తన చివరి పోస్టుగా నిలిచింది.