Advertisement
ఈ మధ్యకాలంలో ఎంతో పెట్టుబడి పెట్టి, ఎన్నో అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా బోల్తా పడుతున్నాయి.. కాని సీతారామం సింపుల్ గా భారీ హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో హీరో హీరోయిను లను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటులను చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు.
Advertisement
also read: ఫిదా మూవీలో ఈ మిస్టేక్ గమనించారా… ?
సినిమాలో ఒకరినొకరు చూసుకోకుండా కేవలం ఎమోషన్స్ ద్వారానే లవ్ చేసుకోవడం అభిమానులకు మరింత కనెక్ట్ అయింది. దీనికి తోడుగా విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ప్లస్ అని చెప్పవచ్చు. మరి ఇతంటి బ్లాక్ బస్టర్ సినిమాలో దర్శకుడు ఒక లాజిక్ మాత్రం మిస్ అయ్యారు. సినిమా థియేటర్ లో చూసినప్పుడు ఈ లాజిక్ ని ఎవరు గమనించలేదు కానీ ఆ తర్వాత కొంతమంది దీన్ని పట్టుకున్నారు.. ఈసినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ పాకిస్తాన్ జైలులో బందీగా ఉన్నప్పుడు తన భార్యకు లెటర్ రాస్తాడు.
Advertisement
ఆ సమయంలో లెటర్ తీసుకొని రష్మిక ఆమెకు చేర్చాల్సి ఉంటుంది.. అయితే ఈ లెటర్ లో అడ్రస్ సీతాదేవి అని రాస్తారు.. కానీ లెటర్లో చివరన ప్రిన్సెస్ నూర్జహాన్ అని రాస్తాడు. అంటే తన భార్య నూర్జహాన్ అని తెలిసినప్పటికీ అడ్రస్ లో సీతాదేవి అని రాయడంతో లెటర్ ను గమ్యస్థానానికి చేర్చడం కోసం రష్మిక చాలా ఇబ్బంది పడుతుంది. ఇంత చిన్న లాజిక్ ని పట్టుకుని నెటిజన్లు అడ్రస్ లో నూర్జహాన్ అని రాసి ఉంటే సరిపోయేది కదా, ఎందుకు అంత కష్ట పెట్టావు భయ్యా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు..
also read: నాగార్జున, చిరంజీవి వారి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లని ఎందుకు రాయలసీమ లోనే జరిపారంటే ?