Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ తేడా లేకుండా దూసుకుపోతున్నారు హీరో నాని. కామెడీ, యాక్షన్,లవ్ ఎలాంటి సినిమా అయినా సరే నానికి ఇట్టే సెట్ అయిపోతుంది. ఎంతో న్యాచురల్ గా యాక్టింగ్ చేసే నానికి న్యాచురల్ స్టార్ గా మంచి గుర్తింపు లభించింది. అలాంటి నాని దసరా సినిమా హిట్ తో మంచి జోరు మీద ఉన్నాడు. హాయ్ నాన్న అనే సినిమాలో చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాంటి నానిని ఒక స్టార్ హీరోయిన్ తీవ్రంగా అవమానించిందట. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Advertisement
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా మొదలైంది అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు సాధించాడు నాని. అయితే ఈ చిత్రంలో నానికి జోడిగా నిత్యమీనన్ చేసిన విషయం అందరికీ తెలుసిందే. ఈ మూవీ తర్వాత ఇద్దరికీ మంచి గుర్తింపు లభించింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా పెరిగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తరచూ గొడవలు పడేవారట. అయితే ఒకానొక సమయంలో వీరిద్దరూ ఒక ఫంక్షన్ కి వెళ్ళారట.
అక్కడ ఫుడ్ తినే సందర్భంలో నాని నిత్యామీనన్ ప్లేట్ నుంచి ఒక ఐటమ్ తీసుకొని తన ప్లేట్లో వేసుకున్నారట. దీంతో కోపానికి వచ్చిన నిత్యామీనన్ అందరి ముందే నీకు సిగ్గుందారా అని అన్నదట. దీంతో నాని నాకు అలాంటి సిగ్గు ఏమీ లేదు, నాకు ఐటెం నచ్చింది తీసుకున్నారని చెప్పారట. దీంతో నిత్యామీనన్ నవ్విందట. అలా వారి మధ్య చాలా క్లోజ్నెస్ ఉండేదని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.