Advertisement
ది లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవనన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది లెజెండ్’. ఈ మూవీని ఆయనే స్వయంగా శరవణ ప్రొడక్షన్స్ పేరిట రూ.80 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసింది. జెడి-జెర్రీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో గీతిక, ఊర్వశి రౌతేలా, ప్రభు, వివేక్, నాజర్ వంటి ప్రముఖ ఆర్టిస్టులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Advertisement
దేశానికి సేవ చేయాలనుకునే ప్రముఖ శాస్త్రవేత్తగా శరవనన్ నటించారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. ఈ సినిమాకి బిలో యావరేజ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అనేదానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రాల వారిగా అసలు ది లెజెండ్ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
Advertisement
తమిళనాడు- రూ. 3.5 కోట్లు, కేరళ- రూ. 10 లక్షలు, కర్ణాటక- రూ. 15 లక్షలు, ఏపీ/తెలంగాణ రూ. 20లక్షలు , బాలీవుడ్- రూ. 10 లక్షలు, ఓవర్సీస్- రూ.10 లక్షలు, వరల్డ్ వైడ్ టోటల్- రూ. 4.35 కోట్లు వసూలు చేసింది. ఈ ప్రకారం అరుల్ శరవనన్ ది లెజెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ సంగతి పక్కన పెడితే అసలు 25% బడ్జెట్ కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. కానీ హీరో కావాలనే కల మాత్రం అరుల్ శరవనన్ నెరవేర్చుకున్నారంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ పాన్ ఇండియా సినిమా అనేది అరుల్ శరవనన్ పాన్ ఇండియా బిజినెస్ కి తొలి అడుగు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమాతో లాసులు వచ్చిన అరుల్ మాత్రం ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యారంటున్నారు.
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?