Advertisement
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. డైలాగ్ రైటర్ నుంచి అగ్రస్థాయి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదిగారు. అయితే ఈయన సినిమాలు ఇప్పటివరకు చాలానే హిట్ అయ్యాయి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. దాదాపు ప్రతి సినిమాలో ఈ కామన్ పాయింట్ కనిపిస్తుంది. అది ఏంటంటే,
Advertisement
ఆయన సినిమాలో హీరోలు తప్పనిసరిగా బ్యాగులు సర్దుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకచోట నుంచి మరొక చోటకు హీరో కదలాల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలను చూస్తే మనకు సింపుల్ గా అర్థం అవుతుంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, అనే సినిమా చూసుకుంటే హీరో తన అత్త కోసం బ్యాగు సర్దుకుని ఇండియాకు ప్రయాణం అవుతాడు. అలాగే పవన్ కళ్యాణ్ మరో సినిమా జల్సా లో కూడా నక్సలైట్ నుంచి జనజీవన స్రవంతి లోకి రావడానికి బ్యాగ్ ను ఎత్తాడు. అలాగే మరో సినిమా అజ్ఞాతవాసి చూసుకుంటే హీరో తన కుటుంబానికి దూరంగా ఉంటాడు. ఆ కుటుంబానికి సమస్య వచ్చిన సమయంలో మళ్లీ బ్యాగు ఎత్తేస్తాడు.
Advertisement
అలాగే ఎన్టీఆర్ అరవింద సమేత, వీర రాఘవ సినిమాలో హీరో తన గ్రామం లో ఫ్యాక్షన్ గొడవల నుంచి దూరంగా ఉండటానికి బ్యాగ్ తో హైదరాబాద్ వస్తాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమా లో అయితే హీరో పుట్టిన కొద్ది నిమిషాలలోనే వేరే చోటికి వెళ్తాడు. జులాయి సినిమాలో విలన్ సోనుసూద్ నుంచి తప్పించుకోవడానికి తాను చనిపోయాడు, అని నమ్మించి విశాఖపట్టణం వెళ్తాడు. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో హీరో బ్యాగ్ పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే అన్నట్టు ఉంటాయి.
Read also : లైగర్ మూవీ రివ్యూ