Advertisement
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం మితిమీరిపోయింది. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రజలు గంటల తరబడి ఆన్లైన్ పోర్టల్స్ లో గడుపుతున్నారు. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి తర్వాత లైక్ లు, షేర్లు, కామెంట్లే జీవితం అయిపోయింది. వీటి కోసం ఎలాంటి వీడియోలు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు కొంతమంది. ఇక మరి కొంతమందికి సోషల్ మీడియా ఆదాయ వనరుగా మారిపోయింది. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఆదాయాన్ని అందుకుంటున్నారు. లైక్స్, షేర్స్ కోసం పెద్ద ఎత్తున సాహసాలకు పాల్పడుతున్నారు.
Advertisement
Read also: కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదల వెనక ఇంత కథ ఉందా ?
మరికొందరు ఏకంగా బెడ్ రూమ్, బాత్రూం వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ జంట ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో మీద నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ ఆ జంట షేర్ చేసిన వీడియో ఏంటంటే.. తమ ఫస్ట్ నైట్ ఇలా జరుపుకుంటున్నాము అని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” శోభనం రాత్రి మేము ఎలా గడిపామో” అనే కాన్సెప్ట్ తో పెళ్లయిన కొత్త జంట వారి ఫస్ట్ నైట్ వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో భాగంగా వధూవరులు ఇద్దరు గదిలో ఉండగా వరుడు వధువు మెడలో ఉన్నటువంటి నగలన్నింటిని తీసివేసి తనకు ముద్దుపెట్టినట్లుగా ఉంది.
ఈ వీడియోని షేర్ చేయడంతో.. దీనికి వారు అనుకున్నంత స్థాయిలో లైక్ లు రాకపోగా ఈ వీడియో చూసిన నెటిజెన్లు మాత్రం భారీగా ఈ కొత్త జంటను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాలుగు గోడల మధ్య జరగాల్సింది.. నడి బజార్లోకి తెచ్చారంటూ సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏది షేర్ చేసుకోవాలో, ఏది షేర్ చేసుకోకూడదో నేటి యువతకు తెలియట్లేదు అంటూ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వీడియోలు షేర్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Read also: హీరోలతో తప్పు చేయించి క్లాస్ పీకడం అవసరమా..?