Advertisement
తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ ను ఓడించిన ఒకే వ్యక్తి అనంతుల మదన మోహన్. ఈయనని కేసీఆర్ కు రాజకీయ గురువుగా చెబుతూ ఉంటారు. ఇంతకీ ఈయన ఎవరు.. ఈయన ఎప్పుడు కేసీఆర్ పై గెలుపొందారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 1983వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో సిద్దిపేట నియోజకవర్గం కూడా ఒకటి. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనంతుల మదన్ మోహన్ ను మళ్లీ ఆ పార్టీ రంగంలోకి దించింది.
Advertisement
ఇవి కూడా చదవండి: ఎన్టీఆర్ వలన ఒరిగిందేమీ లేదు.. షాక్ అవుతున్న బాలకృష్ణ చిన్న అల్లుడి కామెంట్స్..!
ఆయనపై బీజేపీ నుంచి నిమ్మ నర్సింహారెడ్డి పోటీ చేశారు. కొన్ని నెలల కిందటే నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా సిద్దిపేట నుంచి తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ టీడీపీ అభ్యర్థి కూడా కొత్తే. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్). అనంతుల మదన్ మోహన్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 ఎన్నికలు ఆయనకు నాల్గవ అసెంబ్లీ ఎన్నికలు. మొత్తం 1,12,576 మంది ఓటర్లు ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో అప్పట్లో 65.01 శాతం పోలింగ్ జరిగింది.
Advertisement
ఇవి కూడా చదవండి: చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!
73,189 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మదన్ మోహన్‌కు 28,766 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్‌కు 27,889 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నిమ్మ నర్సింహారెడ్డికి 13,358 ఓట్లు వచ్చాయి. అనంతుల మదన్ మోహన్ తన సమీప అభ్యర్థి కేసీఆర్ పై 887 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అలా.. కేసీఆర్ రాజకీయాలకు వచ్చిన కొత్తల్లో కేసీఆర్ పై అనంతుల మదన మోహన్ గెలుపొందారు. తొలి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయినప్పటికీ.. ఆ తరువాత రెండు సార్లు ఆయన మదన మోహన్ ను ఓడించారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఇందులో 13 సార్లు అసెంబ్లీకి 8 సార్లు, లోక్‌సభకు 5 సార్లు ఎన్నికయ్యారు.