Advertisement
తెలంగాణలో ఆర్డీఓ వ్యవస్థపై కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డీఓ వ్యవస్థ త్వరలో మాయం కానుంది. వీరిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో సూపరింటెండెంట్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీఓల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ శాసనమండలిలో స్పష్టం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.
Advertisement
Advertisement
త్వరలో ఆర్డీవో వ్యవస్థ మాయం కానున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవి. 2008లో రిమ్స్, 2013లో నిజామాబాద్ మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 29 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో వైట్ కోట్ రెవల్యూషన్ తీసుకొచ్చామని.. దేశం మొత్తం సీట్లు 2,220 మెడికల్ సీట్లు ఉండగా.. 900 సీట్లు ఒక్క తెలంగాణలో ఉన్నాయని వెల్లడించారు. దాదాపు 43 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నట్టు స్పష్టం చేశారు హరీశ్ రావు. దేశం మొత్తం వైద్యులను సరఫరా చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందని పేర్కొన్నారు.