Advertisement
ఎన్నికల్లో అతి దారుణంగా ప్రతిపక్ష హోదా లేకుండా ఓటమి పాలైన వైసీపీ కి కమెడియన్ అలీ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర సంతృప్తితో ఉన్న అలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి ఆలీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ విషయం సినిమా వర్గాల్లో చర్చనీయంగా మారింది అయితే రాజీనామా వెనుక ఉన్న కారణాలు ఏంటనేది చూస్తే.. సినిమా పరిశ్రమలో అందరివాడుగా పేరు ఉన్న అలీ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.
Advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. పవన్ నటించే సినిమాల్లో అలీ కచ్చితంగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధానికి చిహ్నంగా ఉండేవారు తన స్నేహితుడిని వేరై అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేర్చుకున్న జగన్ మొక్కుబడిగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అనే పోస్ట్ ని ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ లేదా చైర్మన్ వంటి పదవులు ఏమైనా ఇస్తారు అనుకున్నారు తనకు ఇచ్చిన పదవికి అల్లి సంతృప్తి చెందలేదు. పార్టీ ఆదేశాలను కూడా కొన్నిసార్లు పక్కన పెట్టి పవన్ చంద్రబాబు రోజా పోసాని మాదిరిగా అడ్డగోలుగా విమర్శించడానికి ఒప్పుకోలేదు అని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Advertisement
Also read:
అయితే గత ఎన్నికల్లో అలీ పోటీ చేయడం ఉత్సాహం చూపారు. ఆయన పేరును పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలించారు నంద్యాల కానీ కర్నూలు నుండి కానీ పోటీ చేసేలా హామీ కూడా ఇచ్చారని సమాచారం. సీటు కేటాయించకపోవడంతో నిరాశకు చెందారు. జగన్ వ్యవహరించే తీరు కూడా నచ్చలేదు అందుకని పార్టీకి రాజీనామా చేశారని అంతా అంటున్నారు. స్నేహితులు సన్నిహితుల సూచన మేరకు సినిమా కెరియర్ను కొనసాగించేలా ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!