Advertisement
వివాహాన్ని పవిత్రమైన కార్యంగా భావించే భారతదేశంలో విడాకులు అనే పదాన్ని అస్సలు ఇష్టపడరు. ఏ స్త్రీ కూడా తన భర్తకి ఊరకనే విడాకులు ఇచ్చేసి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. తమ భార్య లేదా భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడో.. లేక చనిపోయినప్పుడో మాత్రమే ఆ బంధం ముగిసిందని భావిస్తారు. భారతీయ విడాకుల రేట్లు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నాయి. గ్లోబల్ ఇండెక్స్ నుండి ఇటీవలి డేటా ప్రకారం, భారతదేశ విడాకుల రేటు ఆశ్చర్యకరంగా 1% వద్ద ఉంది.
Advertisement
ఇటీవల విడాకుల కేసులు పెరుగుతున్న కొద్దీ ఈ రేటు ఒక శాతం వద్ద మాత్రమే ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అంటే విడాకులు మంజూరు కూడా చాలా సమయం తీసుకునే ప్రాసెస్ కావడంతో ఈ రేటు ఇలా ఉండవచ్చు. విడాకులు అనేవి ఓ జంట పై చాలా ప్రభావం చూపిస్తాయి. ఇవి శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా అలసిపోయేలా చేస్తుంది. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇటీవల ముంబైకి చెందిన న్యాయవాది జంటలు విడాకులు కోరడానికి అత్యంత విచిత్రమైన కారణాలను బయటపెట్టారు. “హనీమూన్ సమయంలో అసభ్యకరమైన దుస్తులు ధరించిన భార్య,” “భార్య భర్త పాదాలను తాకడానికి నిరాకరించినందుకు కూడా విడాకులు కోరారు ఓ వ్యక్తి.
Advertisement
భార్యకి వంట రాకాపోవడం వలన బ్రేక్ఫాస్ట్ లేకుండా ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చిందని మరో వ్యక్తి విడాకులు అడిగాడు. మరో విచిత్రమైన కారణం ఏంటంటే.. ఓ భర్త యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ భార్య కోసం సమయం కేటాయించకపోవడం వలన ఓ జంట విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. ఇవన్నీ ఆ లాయర్ ఓ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇవన్నీ చూసిన నెటిజన్స్ ఇంత విచిత్రమైన కారణాలకి విడాకులు కావాలని కోరుకుంటున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు అబ్బాయిలు మాత్రం అసలు పెళ్లిళ్లు అవ్వడానికి నానా తంటాలు పడుతుంటే.. ఇంత సిల్లీ రీజన్స్ కి విడాకులు అడుగుతున్నారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని..
“వికెట్స్ తీయడు రన్స్ కూడా చెయ్యడం రాదూ అసలు అవసరమా ? ఇతను జట్టులో ?
పెళ్లయ్యాక తన తల్లికి లేఖ రాసిన కూతురు.. వైరల్ అవుతున్న పోస్ట్..!
“అపరిచితుడు” సినిమాలో ఈ క్లైమాక్స్ వెనుక అసలు అర్ధం ఇదా? శంకర్ సినిమానా మజాకా?