Advertisement
తెలుగు తెరపై అద్భుతమైన కామెడీతో ఆకట్టుకున్న అలనాటి నటులలో ఏవీఎస్ ఒకరు. ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. గుంటూరు జిల్లా తెనాలిలో 1957, జనవరి 2న వీర రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు జన్మించారు ఏవిఎస్. ఈయన వీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. తొలుత తెనాలిలో పౌరోహిత్యం చేసిన ఏవీఎస్.. ఆ తరువాత విజయవాడలో విలేకరిగా పనిచేశారు. ఆ సమయంలో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. తినడానికి కనీసం తిండి కూడా లేక ఆకలిని అదుపు చేసుకునేందుకు కిళ్ళీ నమ్మలేవారట. అన్ని కష్టాలను అనుభవించిన ఏవీఎస్ డబ్బులు కోసం మిమిక్రీ షోలు చేసేవారట.
Advertisement
Read also: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత 10TH క్లాస్ మార్క్స్ లిస్ట్.. వామ్మో ఇన్ని తప్పులా..?
ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ఏవీఎస్ కి “మిస్టర్ పెళ్ళాం” సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సినిమాలో ఏవీఎస్ పాత్రకి మంచి గుర్తింపు లభించింది. దీంతో ఆయన మరెన్నో సినిమాలలో సహాయక పాత్రలు చేశారు. ఆయన కెరీర్ లో సుమారు 750 సినిమాలలో నటించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలలోకి సైతం ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే.. 1980లో ఆశా కిరణ్మయి తో ఏవీఎస్ కి వివాహం జరిగింది.
Advertisement
తెనాలిలో స్టేజీ కార్యక్రమాలలో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి ప్రదీప్, అమ్మాయి ప్రశాంతి. 2008లో ఏవీఎస్ గారికి కాలేయ మార్పిడి శాస్త్ర చికిత్స జరిగింది. ఆ సమయంలో ఏవీఎస్ కుమార్తె ప్రశాంతి ఆయనకు కాలయాన్ని దానం చేశారు. మళ్లీ అదే వ్యాధి బారిన పడడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి 2013లో మరణించారు. అయితే ఏవీఎస్ గారి అల్లుడు కూడా సినీనటుడే అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన పేరు శ్రీనివాస్ దావగుడి. ఇండస్ట్రీలో చింటూ అని పిలుస్తుంటారు. ఈయన ఎక్కువగా రవిబాబు తీసే సినిమాలలో గుండుతోనే కనిపిస్తాడు. ఇప్పుడిప్పుడు అగ్ర హీరోల సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్నారు శ్రీనివాస్.
Read also: మంత్రి ఆర్కే రోజా తండ్రి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?