Advertisement
పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. కానీ కొందరు జీవితాల్లో పెళ్లిళ్లు కలిసి రాదు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటాడు దినేష్ కార్తీక్. ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేష్ కార్తీక్ మొదటి భార్య నికిత వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్ తో సంబంధాన్ని ఏర్పరచుకుంది. తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్, దినేష్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళి టోర్నీలో చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించే దినేష్ కార్తీక్ 2007లో తన 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు. నికిత తండ్రి, దినేష్ కార్తీక్ వాళ్ళ తండ్రి ఇద్దరు స్నేహితులు కావడంతో ఈ ఇద్దరు కలిసి పెరిగారు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్ గా ఉన్న మురళి విజయ్ కూడా హాజరయ్యాడు.
Advertisement
అయితే దినేష్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళి విజయ్ అతని మొదటి భార్య నికితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం దినేష్ కార్తీక్ కి తెలియడంతో నిఖితాకి విడాకులు ఇచ్చాడు. దినేష్ కార్తీక్ తో విడాకులు తీసుకున్న నికితను పెళ్లాడిన మురళి విజయ్ కు ప్రస్తుతం కూతురు, ఓ బాబు ఉన్నారు. 2012లో తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేష్ కార్తీక్ కి, మురళి విజయ్ కి తన భార్యకి ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది. భార్య తనను మోసం చేసిందన్న బాధ కంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసిన తర్వాత నికితకి విడాకులు ఇచ్చేశాడు. దినేష్ కార్తీక్ కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. దీంతో ఆ బిడ్డకు తానే తండ్రి అని తెలుసుకున్న మురళి విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
ఇప్పుడు నికిత, మురళి విజయ్ లకు ముగ్గురు పిల్లలు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళి విజయ్, దినేష్ కార్తీక్ ఈ సంఘటన తర్వాత బద్ధశత్రువులుగా మారిపోయారు. దినేష్ కార్తీక్ తో మాట్లాడటానికి కానీ, ముఖం చూపించడానికి కానీ మురళి విజయ్ సాహసించడు. అంతేకాకుండా దినేష్ కార్తీక్ నిధాహాస్ ప్రదర్శన సమయంలోనూ మురళి విజయ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన కార్తీక్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేసి ట్రోల్స్ బారిన పడ్డాడు మురళి విజయ్. నికిత, మురళి విజయ్ ఇచ్చిన షాక్ నుంచి తేలుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్న దినేష్ కార్తీక్ 2017 లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ తో ప్రేమలో పడ్డాడు. ఒకే కోచ్ దగ్గర ఫిట్నెస్ పాఠాలు నేర్చుకున్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు క్రికెటర్లు అంటే అసహ్యించుకునే దీపిక, దినేష్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది. ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో అన్యోన్యమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు.
READ ALSO : హీరో సుమన్ ని ఆ అమ్మాయి తండ్రి కావాలనే కేసులో ఇరికించాడా..? అప్పుడేమైందంటే ?