Advertisement
తెలుగు ఇండస్ట్రీలోని యువ హీరోలలో ఒకరైన రామ్ ది వారియర్ మూవీ తో మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తొలి రోజు కలెక్షన్స్ బాగానే ఉన్నా, సినిమా తర్వాత ముందుకు వెళ్లలేక పోయిందని సమాచారం. రామ్ పోతినేని, ఆది పినిశెట్టి ఈ మూవీకి ప్లస్ కాగా వారిద్దరి పాత్రలే కనీసం కొంత మంది ప్రేక్షకులనైనా థియేటర్ వరకు రప్పించాయి.
Advertisement
ఈ తరుణంలోనే ఈ మూవీ గురించి ఒక డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. విలన్ పాత్రలో అదరగొట్టిన ఆది పినిశెట్టి ఇక రాజకీయాల్లోకి పోతున్నాము కదా.. వెన్నుపోటు పొడిచేది నేర్చుకుంటున్నానని డైలాగ్ చెప్పారు. వెన్నుపోటు అనేది పాలిటిక్స్ లో కొత్త కాదు. అయితే ఈ డైలాగ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి రాశారు అని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే చంద్రబాబు పై ఎవరైనా విమర్శలు చేయాల్సి వస్తే సీనియర్ ఎన్టీఆర్ ను ఆయన వెన్నుపోటు పొడిచారని అంటుంటారు.
Advertisement
ఎప్పుడూ పాలిటిక్స్ కు దూరంగా ఉండే రామ్ పోతినేని మూవీలో ఈ డైలాగ్ ను సాధారణంగా పెట్టారో లేదంటే కావాలనే పెట్టారో అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ఈ మూవీ లోని ఆ డైలాగు మాత్రం చంద్రబాబు అభిమానులను హర్ట్ చేస్తోందని తెలుస్తోంది. ఒకవైపు రామ్ పోతినేని అభిమానులు మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో చాలా నిరాశ చెందుతున్నారు. రామ్ తర్వాత సినిమా అయినా విజయవంతంగా దూసుకుపోవాలని,రికార్డు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాలు ప్లాప్ అయినా సరే రామ్ రేంజ్ రోజురోజుకు పెరుగుతోంది.
ALSO READ;
ఎప్పుడూ చూడని నాగార్జున మొదటి పెళ్లి ఫొటోలు..మీరు ఓ లుక్కేయండి..!!