Advertisement
కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి. కథని అర్థం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు. థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే మన టాలీవుడ్ దర్శకుల పనుల వల్ల కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also : వెంకటేష్ తన 35 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు వదులుకున్నారో తెలుసా..?
#1 శ్రీను వైట్ల – అమర్ అక్బర్ ఆంటోనీ
శ్రీనువైట్ల సినిమా అంటే సాధారణ కథతో మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా మనం ఇప్పటికే చూసిన అతనోఒక్కడే మరియు పాత 80 మరియు 90 ల సినిమాల కాన్సెప్ట్ ని గుర్తు చేస్తుంది. కేవలం స్టైలిష్ మేకింగ్ మరియు విజువల్స్ తో చేద్దాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.
#2 గుణశేఖర్ – నిప్పు
గుణశేఖర్ అంటే మంచి చేస్ లు, సెట్స్, హీరోయిజం, ఎలివేషన్స్ ఉంటాయి. కానీ ఏదో పాత స్టోరీ లైన్ ని డెవలప్ చేసి తీసిన ఈ నిప్పు మాత్రమే ఆడియన్స్ రివ్యూస్ కి ఆరిపోయింది.
Advertisement
#3 త్రివిక్రమ్ శ్రీనివాస్ – అజ్ఞాతవాసి
గురూజీ పీకే కాంబో అది కూడా మూడవసారి అంటే డబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ అత్తారింటికి దారేది సినిమాలో లైన్ తీసుకొని అటు ఇటు మార్చి అదే సీఈవో, అదే ఫ్యామిలీ డ్రామాని మళ్లీ కొత్తగా చెప్పే ప్రయత్నం చేసి కెరిర్ లో చెత్త డిజాస్టర్ ఫేస్ చేశాడు మన త్రివిక్రమ్.
#4 శ్రీకాంత్ అడ్డాల – బ్రహ్మోత్సవం
ఇక మహేష్ బాబు లాంటి స్టార్ ని పెట్టి ఏదో తీద్దాం అనుకోని ఏదో తీశారు అడ్డాల. అసలు ఇలాంటి క్లాస్ ఫ్యామిలీ సబ్జెక్టులో సూపర్ స్టార్ ని పెట్టడమే పెద్ద తప్పు అయితే, దాన్ని మళ్ళీ సరిగ్గా తీయకుండా కెరీర్ లో చెత్త డిజాస్టర్ ఫేస్ చేశారు అడ్డాల.
#5 బోయపాటి శ్రీను – వినయ విధేయ రామ
బోయపాటి సినిమాల్లో లాజిక్స్ కి అందని మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ వీవీఆర్ లో మాత్రమే ఆ మాస్ ఎలిమెంట్స్ ని కొంచెం ఎగ్జగరేట్ చేసి చూపించడం వల్ల ప్రేక్షకులు ఏంటయ్యా బోయపాటి ఈ అతి అని తిట్టుకున్నారు.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?