Advertisement
సాధారణంగా ప్రతిరోజు మన ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులో అనేక డిజైన్ లు ఉంటాయి..మరి ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే విషయాన్ని మీరు ఇప్పటివరకు అర్థం చేసుకో లేదు కదూ.. దాని వెనుక కూడా ఒక చరిత్ర దాగి ఉంది.. ఇంటి గడప ముందు ముగ్గులో రెండు అడ్డగీతలు ఇంటి లోపలికి వచ్చే దుష్టశక్తులను నివారిస్తాయి..
Advertisement
అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు పోకుండా చూస్తాయి.. ముగ్గు వేసి దానికి నాలుగు దిక్కులు అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన పనులు శుభకార్యాలు జరుగుతాయని అర్థం.. పండుగ సందర్భంలో ఇది ఖచ్చితంగా పాటిస్తారు.. ఒకవేళ తెలియకుంటే పాటించండి.. ఏదైనా దేవతా పూజలు చేస్తే మనం దేవున్ని ఉంచే పీట మీద ముగ్గు వేసి గీతలను గీస్తాం.
also read:థియేటర్లోకి రాకముందే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఏంటంటే..?
Advertisement
నక్షత్ర ఆకారంలో వచ్చే గీతలలో వేసే ముగ్గు భూతప్రేత పిశాచాలను దరిచేరకుండా చేస్తుందట.. అలాగే కొన్ని చుక్కల ముగ్గులలో మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉంటాయట.. అవి గీతలే కానీ మంత్ర తంత్ర యంత్ర రహస్యాలతో మనకు హాని కలిగించే శక్తులను మన దరిచేరకుండా ఆపుతాయని అంటుంటారు..
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే టైం లో వారి చుట్టుపక్కల పుష్పాలు లతలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.
అలాగే దేవతా రూపాల దగ్గర స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయాలి.
ఏ స్త్రీ అయినా దేవాలయంలో అమ్మవారు మహావిష్ణువు ముందు రోజు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ జన్మ జన్మల వరకు సుమంగళి గానే మరణిస్తుందని పురాణాల్లో చెప్పారు.
ఈ విధంగా ముగ్గుల వెనక అనేక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి.
also read:కొడుకు మరణించిన 2 నెలలకు ఫోన్ చెక్ చేసిన మామ..వాట్సాప్ లో ఆ మెసేజ్ లు చూసి షాక్..!!