Advertisement
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకేక్కిన కాంతార చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నటనకు ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి.
Advertisement
Read also: మంత్రి రోజాకి “బ్రహ్మాజీ” కౌంటర్ మాములుగా ఇవ్వలేదు గా !
కర్ణాటక సాంప్రదాయమైన భూతకోల కాన్సెప్ట్ కు అందరూ కనెక్ట్ అయ్యారు. అచ్యుత్ కుమార్ నెగిటివ్ రోల్ లో కనిపించగా, కిషోర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. సినిమాలో అప్పుడప్పుడు వచ్చే “ఓ” అనే శబ్దంతో ప్రేక్షకులకి గూస్ బంప్స్ తప్పలేదు. ఇదిలా ఉంటే ఇలాంటి కథతోనే మన తెలుగులో కూడా ఓ సినిమా వచ్చిందని మీకు తెలుసా..! ఆ చిత్రం ఏదంటే..? దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి దగ్గర శిష్యునిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు ఆకాశవాణి అనే సినిమాని తెరకెక్కించారు. 2021లో తెరకెక్కిన ఈ చిత్రం నాగరిక ప్రపంచానికి దూరంగా, కొండకోనల్లో ఓ గూడెంకు చెందిన జనానికి సంబంధించిన కథ. ఈ చిత్రంలోని గూడెం ప్రజలు ఓ చెట్టు తొర్రలో ఉండే బండరాయిని దైవంగా భావించి పూజలు చేస్తుంటారు.
Advertisement
ఆ బండరాయి తర్వాత ఆ ఊరి ప్రజలు ఆ ఊరి దొర ( వినయ్ వర్మ) ని బలంగా నమ్ముతారు. ఆ దొర చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉంటారు. కానీ ఆ దొర మాత్రం గూడెం ప్రజలను భయపెడుతూ, వాళ్ల శ్రమను దోచుకుంటూ ఉంటాడు. అయితే ఓ రోజు గూడెం ప్రజలు ఊహించని విధంగా వారు కొలిచే దేవి స్థానంలోకి ఓ రేడియో వచ్చి చేరుతుంది. దాన్ని కూడా దేవుని గానే భావించి కొలుస్తుంటారు. అలాంటి వారి జీవితంలోకి చంద్రం మాస్టారు ( సముద్రఖని) వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభరెడ్డి నిర్మించారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేశారు. కానీ అంతగా రెస్పాన్స్ రాలేదు.
Read also: రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచిన స్టార్ 10 హీరోయిన్ల లిస్ట్ వారెవరంటే ?