Advertisement
వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కి పాపులారిటీ ఉంటుంది. టెలివిజన్ చానల్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ఇదంతా పక్కకు పెడితే, తమ డాన్స్ తో ఇండియన్ స్క్రీన్ ని షేర్ చేసిన 10 మంది హీరోయిన్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం.
Advertisement
# శ్రీ లీల:
శ్రీ లీల, అందం మాత్రమే కాదు అద్భుతంగా డాన్స్ చేయగలదు. ఈమె డాన్స్ లో మంచి గ్రేస్ కూడా ఉంటుంది. ధమాకా హిట్ కావడానికి శ్రీ లీల ఎంతో కష్టపడింది.
# మాధురి దీక్షిత్:
తన అందంతో పాటు డ్యాన్స్ తో కూడా మంత్రముగ్ధుల్ని చేసేది ఈ బాలీవుడ్ హీరోయిన్. ఈమెను లిస్టులో నెంబర్ వన్ అనుకోవచ్చు.
# ఊర్మిళ:
రంగీలా బ్యూటీ డ్యాన్స్ తో అందరిని మత్తెక్కించగలదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అంటే ఈమె డ్యాన్స్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
# ఐశ్వర్యారాయ్:
సాధారణంగా ఐశ్వర్యం అంటే డబ్బు అనాలి. కానీ దానికి డెఫినేషన్ అందమని మార్చేసింది ఈ బ్యూటీ. అందం మాత్రమే కాదు డాన్స్ తో కూడా ఈమె టాప్ లేపేసేది.
Advertisement
# రాధా:
అప్పట్లో మన మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈమే చేసే డ్యాన్స్ కు థియేటర్స్ లో జనాలు ఈలలు, కేకలతో ధూమ్ ధామ్ చేసేవారు. అంత బాగా డాన్స్ చేసేది.
# శ్రీదేవి:
మన అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని ఊపేసింది.
# సమీరా రెడ్డి:
ఎంత ఫేడౌట్ అయిపోయినా సరే ఈమె డాన్స్ మాత్రం ఇరక్కోట్టేసేదండి.
# తమన్నా:
మిల్కీ బ్యూటీ కూడా డ్యాన్స్ సూపర్ గా చేస్తుంది. ఈమే అందానికి డ్యాన్స్ తోడైతే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూసాం.
# శృతిహాసన్:
హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె డ్యాన్స్ చేయగలదు. ఈమె కూడా బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు.
# సాయి పల్లవి:
మన ఫిదా బ్యూటీ డ్యాన్స్ గురించి చెప్పేదేముంది. ఈమె డ్యాన్స్ చేసే సాంగ్స్ అన్ని యూట్యూబ్‌ల్లో బిలియన్ వ్యూస్ ను కొల్లగొడుతుంటే, హీరోలు కూడా ఈమెతో పోటీపడి డ్యాన్స్ చేయలేకపోతున్నారు.
Read also: కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?