Advertisement
సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను అనుసరించుకుంటూ పెరుగుతారు. మనం పిల్లల ముందు ఏ విధంగా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అదే అలవాట్లలో పెరుగుతూ ఉంటారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలకు నష్టం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కొంతమంది తల్లిదండ్రుల మాటలను బట్టి నేర్చుకుంటారని, వారి మాటలకు అనుగుణంగానే నడుచుకుంటారని ఈ మూడు విషయాలు చూస్తే మీకు అర్థమవుతుంది.. మరి తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు మాట్లాడకూడని, చేయకూడని పనులు ఏంటో చూద్దాం..
Advertisement
నువ్వు నవ్వితే బాగుండవు:
అయితే కొంతమంది తల్లిదండ్రులు లేదా స్నేహితులు ఇతర స్నేహితులపై కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి పదవ తరగతి చదివే సమయంలో తన స్నేహితుడు నువ్వు నవ్వితే అస్సలు బాగుండవు అని అన్నారట. ఇక అప్పటినుంచి ఆ వ్యక్తి పెండ్లై 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ అస్సలు నవ్వలేదట. మరి ఆయన ఎందుకు నవ్వరు అని చాలామంది పోస్ట్ చేసి అడిగేసరికి , నేను పదో తరగతిలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నువ్వు నవ్వితే బాగుండవని చెప్పాడు. అందుకే అప్పటినుంచి నవ్వడం మానేశాను. ఆ విధంగా చిన్నతనంలో ఎవరైనా ఇలా కించపరిచినట్టు మాట్లాడితే దానికి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేస్తూ వస్తాం.
2. చిన్నప్పుడు తెల్లగా ఇప్పుడు నల్లగా ఉన్నావ్ :
అయితే ఒక పిల్లాడు ప్రతిరోజు 45 నిమిషాలకు పైగా స్నానం చేస్తున్నాడట. అయితే ఈ విషయాన్ని తన తల్లి గమనించి అడుగుదామనుకుంది. కానీ అడగలేకపోయింది. కానీ ఒకానొక సమయంలో ఆ పిల్లాడికి టైం,టేబుల్ రాసిందట. ముందుగా నువ్వు 15 నిమిషాల్లో స్నానం చేయాలి అందట. అప్పుడు ఆ పిల్లాడు 15 నిమిషాల అస్సలు కుదరదు అని చెప్పాడట. ఆడపిల్లలు ఎంత సేపు స్నానం చేయరు. నువ్వు ఏం చేస్తావ్ బాత్రూంలో అని అడిగిందట. చివరికి ఆ పిల్లాడు ఒక వెరైటీ సమాధానం ఇచ్చారట. నాన్న నన్ను నల్లగా అవుతున్నావు అని తరచు అంటున్నాడు. నేను చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండే వాడినట, వయసు వచ్చినా కొద్దీ నల్లగా అవుతున్నారని అంటున్నారు. అందుకే ప్రతిరోజు 45 నిమిషాలకు పైగా స్నానం చేస్తున్నానని సమాధానం ఇచ్చారట.
Advertisement
3.అనవసరంగా పుట్టావు :
కొంతమంది తల్లిదండ్రులు చిన్నారి మనసులను గాయ పెడుతూ ఉంటారు. అది తల్లిదండ్రులు అనుకోకుండానే అన్న మాటలు వారి మనసులో గుచ్చుకుంటాయి. అలా ఒక తండ్రి తన పుట్టిన రెండో కొడుకును నువ్వు అనవసరంగా పుట్టావు అని అన్నారట. అన్నయ్య పుట్టాక నిన్ను కనకుంటే అయిపోవు నీవల్ల తరచూ ఆస్పటల్ వెళ్లాల్సి వస్తోంది. నీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండడం లేదు. నీవల్లే నా లైఫ్ లో సమస్యలు వస్తున్నాయని అన్నారట. అయితే ఆ పిల్లాడికి కాస్త ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడంతో తరచూ అనారోగ్యం పాలవుతున్నారట. దీనివల్ల తండ్రి విసుగు చెంది ఈ మాట అనడంతో, పిల్లాడు 8వ తరగతి వచ్చాక నేను సూసైడ్ చేసుకుంటానని ఒక లెటర్ రాశాడట. నేను ఇంట్లో ఎవరికీ నచ్చడం లేదని అందులో మెన్షన్ చేశారట. ఈ లెటర్ తోటి విద్యార్థులు చూసి క్లాస్ టీచర్ చెప్పడంతో ఇది కాస్త ప్రిన్సిపల్ వరకు వెళ్లడంతో , వారి తల్లిదండ్రులను పిలిచి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నావు అని అడిగాడట. దీంతో పిల్లాడు మా నాన్న నా వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారట, నేను అనవసరంగా పుట్టానని అంటున్నాడు. అందుకే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చారట..
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- పెళ్లిలో చదివింపులు ఎందుకు చదివిస్తారు.. దీని వెనుక అసలు కథ ఇదేనా..?
- పెళ్లి చేసుకున్న భార్యను వదిలి, మరో యువతిని ప్రెగ్నెంట్ చేసిన వ్యక్తి.. చివరికి..!!
- ఈ 6 విషయాల్లో ఆడవారిని, మగవారు అసలు అర్థం చేసుకోలేరు..!!