Advertisement
మన దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. హిందూమతంలో శక్తికి ప్రతిరూపాలైన ముగ్గురు దేవుళ్లలో శివుడు ఒకరు. శివుడిని తరచుగా లింగ రూపంలో పూజిస్తారు. శివరాత్రి పండుగ శివుడికి అంకితం చేయబడింది. ఆరోజు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు శివాలయాలను సందర్శించి దేవుని ఆశీర్వాదం పొందుతారు. ఇలా ప్రతి ఒక్క హిందువు కనీసం ఒక్కసారైనా సందర్శించవలసిన భారతదేశంలోని 10 మహాశివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
Advertisement
Read also: పాక్ ప్రధాని వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్!
1) కేదార్నాథ్ ఆలయం – ఉత్తరాఖండ్.
క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ శివాలయం ఇప్పటికీ ఉత్తరాఖండ్ లో ఇప్పటికీ పదిలంగా ఉంది. ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమిపై ఉన్న ఈ ఆలయం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
2) అమర్నాథ్ ఆలయం – కాశ్మీర్.
హిందూమతంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో అమర్నాథ్ ఆలయం ఒకటి. జూలై నుంచి జూన్ మధ్య నెలల్లో ఈ ఆలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు.
3) కాశీ విశ్వనాథ్ – ఉత్తర ప్రదేశ్.
పురాణాల ఆధారంగా ఈ ఆలయంలో మరణించిన వ్యక్తి పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఈ ఆలయం 1780లో స్థాపించబడింది. కాశీ యొక్క ప్రారంభ నిర్మాణం 11వ శతాబ్దంలో హరిచంద్రుని కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయం వారణాసి నగరంలో కలదు.
4) కైలాసనాద్ ఆలయం – మహారాష్ట్ర.
ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం నిర్మించి దాదాపు 100 సంవత్సరాలు పూర్తయింది. భారతదేశంలోని మహారాష్ట్రలో ఎల్లోరా గుహలలోని అతిపెద్ద భారతీయ కట్ – రాక్ హిందూ దేవాలయాలలో ఇది ఒకటి.
Advertisement
5) కోటిలింగేశ్వర ఆలయం – కర్ణాటక.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ఈ ఆలయ దర్శనానికి ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారు.
6) చిదంబరం నటరాజ ఆలయం – తమిళనాడు.
శివుడు తన విశ్వ నృత్యాన్ని ప్రదర్శించినట్లు విశ్వసించే ఐదు సభలలో ఇది ఒకటి. ఈ ఆలయ నిర్మాణ రూపకల్పన కూడా ప్రత్యేకంగా ఉంటుంది. నాలుగు స్తంభాలు, బంగారు పూతతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
7) మల్లికార్జున స్వామి ఆలయం – ఆంధ్ర ప్రదేశ్.
ఈ ఆలయం శివునికి పూజ స్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని హరిహర రాయ అనే రాజు నిర్మించారు. భారతదేశంలోని పురాతన క్షేత్రాలలో ఇది ఒకటి అని నమ్ముతారు.
8) శ్రీకాళహస్తి ఆలయం – ఆంధ్రప్రదేశ్.
ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన శివ స్థలాలలో ఒకటి. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో కన్నప్ప రక్తపు లింగాన్ని ఆపడానికి తన కన్ను ఇచ్చాడు. కానీ అతను ఆ పనిని పూర్తి చేయడానికంటే ముందే శివుడు జోక్యం చేసుకొని అతనికి బదులుగా మోక్షాన్ని ఇచ్చాడు.
9) సోమనాథ్ ఆలయం – గుజరాత్.
శక్తివంతమైన శివునికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. మొదట ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించగా.. అది ధ్వంసం కావడంతో దానిని వెండితో పునర్నిర్మించారు.
10) శివ మహాకాళేశ్వరం – మధ్యప్రదేశ్.
ఇది ఉజ్జయిని నగరంలోని మహాకాళేశ్వర్ అని పిలువబడే ఒక ప్రసిద్ధ దేవాలయం. 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం ఒకటి.