Advertisement
సృష్టిలో కలకాలం కలిసి ఉండాల్సిన ఒకే ఒక బంధం భార్యాభర్తల బంధం. మనిషి జీవితంలో తల్లిదండ్రులు కొద్ది సమయం వరకే తోడుంటారు. ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యేంతవరకే తోడుగా ఉంటారు. కానీ జీవితాంతం తోడుగా నిలిచేది భార్యాభర్తలు ఇద్దరే. అయితే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా కొన్ని విషయాలను భర్తతో చెప్పుకోవడానికి మాత్రం వెనకడుగు వేయాల్సిందే. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు, పురుషులు పెళ్లికి ముందే కొన్ని అలవాట్లు చేసుకునే ఉంటారు. అవి మంచి విషయాలు అయితే ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. ఒకవేళ అవి చెప్పుకోకూడనివి అయితే మనసులోనే దాచుకుంటారు. ముఖ్యంగా వివాహమైన తర్వాత శ్రీను ఈ రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వరు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
Advertisement
Read also: ఉదయ్ కిరణ్ హిట్స్ మరియు ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే..!!
1) పోలిక : ప్రతి స్త్రీ తన మనసులో జీవిత భాగస్వామిని వేరే వ్యక్తితో పోల్చి చూసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే తాము ఎవరితో జీవిత భాగస్వామిని పోల్చుకుంటున్నాము అనే విషయాన్ని మాత్రం భర్తకి తెలియనివ్వరు. మరొకరితో పోల్చి చూసుకున్నప్పుడు తన జీవిత భాగస్వామిలో మంచి చెడులను గమనిస్తూ ఉంటారు.
Advertisement
2) పెళ్లికి ముందు ప్రేమ : ఏ భార్య అయినా పెళ్లికి ముందు ఆమె ఎవరితో ప్రేమలో పడి అతడిని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన ప్రేమ వ్యవహారం గురించి తన భర్తకు అస్సలు తెలియనివ్వదు. ప్రస్తుత కాలంలో కొంతమంది పెళ్లయిన తర్వాత కూడా భర్తకి తెలియకుండా అలాంటి వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ విషయాలు భర్తకి తెలిస్తే ఆ బంధం మధ్యలోనే తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ రహస్యాన్ని అస్సలు తెలియనివ్వదు.
3) భర్త కుటుంబం: మీరు కుటుంబంతో (తల్లి దండ్రులతో) కలిసి ఉన్నప్పుడు మీ భార్య మీపై ఎక్కువగా కోపాన్ని చూపిస్తుంది అంటే ఆమె మనసులో ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ వేరే కాపురం పెట్టాలని ఆమె మనసులో ఉన్నా ఆ విషయాన్ని మీతో చెప్పదు. ఇంట్లో ఉన్న వివిధ వస్తువులపై కోపాన్ని చూపిస్తుంది. కానీ నేరుగా ఈ విషయాన్ని మాత్రం చెప్పదు.