Advertisement
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎక్కువ లైఫ్ ఉంటుంది. కానీ హీరోయిన్ లైఫ్ చాలా తక్కువ. మహా అయితే ఒక హీరోయిన్ పదేళ్లపాటు హీరోయిన్ పాత్రలు చేస్తుంది. అంతకు మించి చేసిన సీనియర్ హీరోలకు జోడి కట్టాలి. ఒకవేళ ఫిట్నెస్ కోల్పోయిందంటే సీనియర్ హీరోల సినిమాలలో కూడా ఆఫర్లు ఈజీగా రావడం కష్టమే. అయితే ఒకప్పుడు హీరో పక్కన హీరోయిన్గా చేసి, ఆ తర్వాత అదే హీరోకు తల్లి క్యారెక్టర్ చేసిన వారు ఉన్నారు. మరి హీరో పక్కన హీరోయిన్ గా చేసి… అదే హీరోకి తల్లిగా చేసిన భామలు ఎవరో చూద్దామా..
Advertisement
Read also: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?
ఈ లిస్ట్ లో ఊర్వశి, శారద ఒకరు. ఈమె సూపర్ స్టార్ కృష్ణ పదుల సంఖ్యలో హీరోయిన్గా చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కృష్ణ పక్కన అగ్ని కెరటాలు, అగ్నిపర్వతం వంటి మూవీలో తల్లిగా చేసింది.
Advertisement
చిరంజీవితో మగధీరుడు మూవీలో హీరోయిన్గా చేసిన జయసుధ రిక్షావోడు మూవీకి వచ్చేసరికి తల్లి పాత్రకు సరిపెట్టుకుంది. దివంగత నటి సుజాత మొదట్లో చిరంజీవి పక్కన ప్రేమ తరంగాలు మూవీలో కథానాయికగా చేసి ఆ తర్వాత బిగ్ బాస్ మూవీలో తల్లిగా నటించింది.
ఇక భానుప్రియ కూడా అంతే. వెంకటేష్ తో ఒకప్పుడు శ్రీనివాస కళ్యాణం, వారసుడొచ్చాడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత జయం మనదేరా మూవీలో వెంకటేష్ కు తల్లి రోల్ చేశారు.
ఇక రీసెంట్ గా అయితే అనుష్క, ప్రభాస్ ది హిట్ పెయిర్ అని అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరికి కాంబినేషన్లో వచ్చిన బిల్లా, మిర్చి మూవీ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. కానీ బాహుబలి-2 లాంటి సెన్సేషన్ మూవీలో మాత్రం అనుష్క తల్లి పాత్రలో ఒదిగిపోయింది. అయినా కూడా ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?