Advertisement
సౌత్ ఇండియా సినీ పరిశ్రమకు చెందిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు “సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు(SIIMA) ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో జరుగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డులకు పోటీ పడుతున్నటువంటి సినిమాల లిస్ట్ ను ఇటీవలే సైమా టీమ్ విడుదల చేసింది. తాజాగా దర్శకుల లిస్ట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ నుంచి దర్శక ధీరుడు రాజమౌళి (ఆర్.ఆర్.ఆర్), చందు మొండేటి (కార్తికేయ 2), హను రాఘవపూడి (సీతారామం), శశికిరణ్ తిక్కా (మేజర్), విమల్ కృష్ణ (డీజే టిల్లు) ఈ పోటీలో నిలిచారు. గత ఏడాది ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు.. వాటికి సంబంధించిన వారి ప్రతిభను గుర్తించి ఈ అవార్డులకు నామినేట్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR. సిద్ధు జొన్నల గడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2, అడివి శేష్ మేజర్ సినిమాలతో పాటు డీసెంట్ బ్లాక్ బస్టర్ సీతారామం కూడా పోటీ పడుతున్నాయి. అయితే వీటిలో ఆర్ఆర్ఆర్ ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. సీతారామం 10 కేటగిరిల్లో, తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకి దక్కాయి. కమల్ హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్స్ ని దక్కించుకుంది. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది రిషబ్ శెట్టి కాంతార మూవీ. యశ్-ప్రశాంత్ నీల్ మాస్, యాక్షన్ మూవీ కేజీఎఫ్ 2 లకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి.