Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరో ” మెగాస్టార్ చిరంజీవి”. అందుకే మెగాస్టార్ అంటే స్టార్ హీరోలకు సైతం ప్రత్యేక ఆకర్షణ. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు.
Advertisement
ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ రెండు పడ్డాయి. అయితే మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
Read also: మహిళలలో ఈ గుణాలుంటే.. పురుషులు వారికి ఫిదా అవుతారట !
1) సైరా నరసింహారెడ్డి: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ లో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్దద డిజాస్టర్ గా నిలిచింది.
2) అంజి: శ్యాంప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ “అంజి”. అంచనాలను తారుమారు చేసి ఈ మూవీ భారీ పరాజయాన్ని చవి చూసింది.
3) మృగరాజు: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మృగరాజు. ఈ సినిమా హాలీవుడ్ చిత్రం “ది గోస్ట్ అండ్ ది డార్క్ నెస్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన మృగరాజు సినిమా సైతం డిజాస్టర్ గా మిగిలింది.
4) ఆచార్య: చిరంజీవి, రామ్ చరణ్ లు తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
Advertisement
5) శంకర్ దాదా జిందాబాద్: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించిన హిట్ మూవీ ” లగే రహో మున్నాభాయ్” సినిమాని అదే తరహాలో తెలుగులో చిరంజీవితో శంకర్ దాదా జిందాబాద్ గా రీమేక్ చేశారు. ఈ సినిమా కాస్త ప్రేక్షకుల ఆదరణ అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది.
6) రిక్షావోడు: గుణశేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నగ్మా హీరోయిన్ గా నటించిన రిక్షావోడు సినిమా సైతం అంచనాలకు భిన్నంగా డిజాస్టర్ గా నిలిచింది.
7) బిగ్ బాస్: విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి సినిమా బిగ్ బాస్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.
8) ఎస్పీ పరశురామ్: రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994 లో విడుదలైన ఈ చిత్రం కూడా భారీ ఫ్లాప్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన ఈ చిత్రం ప్లాప్ అవుతుందని ఎవరు ఊహించలేదు.
ఇవేకాక.. లంకేశ్వరుడు, రాజా విక్రమార్క, యుద్ధభూమి, ఆరాధన, జేబుదొంగ, కిరాతకుడు, రుద్రనేత్ర, చాణక్య శబదం, వేట, చిరంజీవి, ధైర్యవంతుడు, హీరో వంటి సినిమాలు కూడా ప్లాప్ గా నిలిచాయి.