Advertisement
ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో ఆ సినిమాకి టైటిల్ కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమా టైటిల్స్ మంచి అర్థంతో వినడానికి చాలా బాగుంటాయి. అయితే మరికొన్ని సినిమాలు టైటిల్ కి, కథకి అసలు సంబంధం ఉండదు. చిత్రవిచిత్రంగా పేర్లు పెట్టి కథకు సంబంధం లేకుండా టైటిల్ ఖరారు చేస్తారు. ఇక మరికొన్ని సినిమాలకు గతంలో బాగా హిట్ అయినా సినిమా పేర్లని రిపీట్ చేస్తారు. అయితే ఇందులో రెడ్డి టైటిల్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్లుగా నిలిచాయి. బాలకృష్ణ సమరసింహారెడ్డి తో మొదలైన ఈ ట్రెండ్.. త్వరలో విడుదల కానున్న బాలయ్య వీర సింహారెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో రెడ్డి టైటిల్ తో వచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం..
Advertisement
Read also: మహేష్ బాబు ‘అతడు’ సినిమా ఆ చిత్రానికి కాపీయా.. త్రివిక్రమ్ అక్కడ లేపేశాడా..?
1) సమరసింహారెడ్డి.
1999లో బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం సమరసింహారెడ్డి.
2) చెన్నకేశవరెడ్డి.
2002 లో వివి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా టబు, శ్రీయ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం చెన్నకేశవరెడ్డి.
Advertisement
3) అర్జున్ రెడ్డి.
2017లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, శాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి.
4) భరతసింహారెడ్డి.
2002 లో సూర్య ప్రకాష్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా, మీనా హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం భరతసింహారెడ్డి.
5) జార్జి రెడ్డి.
2019 లో దళం ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి.
6) జాంబిరెడ్డి.
2020 లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం జాంబిరెడ్డి.
7) సైరా నరసింహారెడ్డి.
2018లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి.
8) శైలజ రెడ్డి అల్లుడు.
2018 లో మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం శైలజ రెడ్డి అల్లుడు.