Advertisement
సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కథ బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథ, నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ప్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కమ్ బ్యాక్ అయిన మూవీస్ ఏంటో మరోసారి చూద్దాం.
Advertisement
#1 పవన్ కళ్యాణ్:
2001లో ఖుషి మూవీ వరకు తిరుగులేని క్రేజ్ ను చవిచూసిన స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూవీ తర్వాత అన్ని ప్లాపులే వచ్చాయి. జానీ, గుడుంబా శంకర్, అన్నవరం, తీన్మార్, పంజా ఇలా ఏది చూసినా అన్ని ప్లాపులే ఉన్నాయి. ఇక హిట్ రాదనే తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసి పవన్ కళ్యాణ్ కు భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది.
#2 మహేష్ బాబు:
పోకిరి లాంటి అల్టిమేట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు సైనికుడు, అతిథి మూవీలు నిరాశే మిగిల్చాయి. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఖలేజా చేస్తే అది కూడా ప్లాప్ అయ్యింది. ఈ తరుణంలోనే వచ్చిన సినిమా దూకుడు, 100 కోట్ల గ్రాస్ ని దాటుకొని మహేష్ కు భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది.
Advertisement
#3 ప్రభాస్:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చత్రపతి మూవీతో పవర్ఫుల్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దీని తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని పెద్దగా హిట్ కాలేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన అవి క్లాస్ మూవీస్. దీని తర్వాత రిలీజ్ అయిన మాస్ మూవీ మిర్చి. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి ఈ భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది.
#4 అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి ఆయనకు ప్లాప్స్ వచ్చిన మళ్లీ ఒక్క హిట్ తో మొత్తం స్టార్ డమ్ ని పెంచుకుంటూ పోతాడు. సరైనోడు హిట్ తరవాత కాస్త బ్యాడ్ టైం నడిచింది. ఈ తరుణంలోనే వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది.
#5 రవితేజ:
2017 రాజా ది గ్రేట్ హిట్ తర్వాత రవితేజకు వరుస ప్లాప్స్ వచ్చాయి. రవితేజ పని అయిపోయింది అన్న సమయంలో అప్పుడు వచ్చింది క్రాక్. రవితేజ కెరీర్ లో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది.
REad Also : Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 14.08.2022