• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే ప్రమాదాలు ఇవే..!

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే ప్రమాదాలు ఇవే..!

Published on September 9, 2023 by Mounika

Advertisement

బ్రహ్మం గారు ఓ గొప్ప జ్ఞాని. ఆయన 16వ శతాబ్దానికి చెందిన మహా ఋషి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంతో భవిష్యత్తును దివ్య దృష్టితో అంచనా వేసి తన అందరికీ తెలిసే విధంగా తాళపత్రాల గ్రంధాలపై లిఖించారు. బ్రహ్మంగారి చెప్పిన ఎన్నో భవిష్యత్తు వాస్తవాలు ఇప్పటికీ నిజాలు అయినట్లు చాలా ఆధారాలు ఉన్నాయి. బ్రహ్మం గారి జ్ఞానం వల్ల మానవ ప్రవర్తన, మారుతున్న మనస్తత్వాల స్వభావం – ఆలోచన మరియు ఆసన్నమైన భౌగోళిక మార్పులను, దేశానికి పొంచి ఉన్న పెనుమొప్పులను ఎన్నో ఆయన కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పొంచి ఉన్న పెను ప్రమాదాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 5972 దాతు నామసంవత్సరాల తర్వాత మాఘా శుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కంచి కామాక్షి మాత కన్నులు వెంబట నీరు కారుతుంది. ఈ సంఘటన తర్వాత వందలాదిమంది మృత్యువాత పడతారు. కోటి దూపాది కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువలన ఎంతమందో నష్టపోతారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.

 

పట్టపగలు ఆకాశము నుంచి పిడుగులు వాన పడి నిప్పుల వర్షం కురుస్తుంది. ఈ సంఘటనతో కొంతమంది మరణిస్తారు. కంచి, శృంగేరి, పుష్పగిరులలో అనేక వింతలు పుట్టుకొస్తాయి. అక్కడి పీఠములకు గడ్డుకాలం ఏర్పడి పీఠాధిపత్యం విశ్వబ్రాహ్మణులకు చేరుతుంది. వెంకటేశ్వర స్వామి కుడి భుజం అదురుతుంది. దీంతో తిరుమలకు వెళ్లే దారిలోనే మోసపోతాయి. ఊరురా పొలిమేర వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయి. ఐదేళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు భవిష్యత్తు చెబుతాడు.

Advertisement

12 రోజులపాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు. 13వ రోజున భయంకరమైన వరదలు వస్తాయి. గోపురం కూలి కుంబుడి కుంభకోణం రూపం మారుతుంది. క్షిపణీ, అనుదాడులతో హంపి, కర్ణాటక ప్రాంతాలు దెబ్బతింటాయి. కంచికి పడమట కామదేను జన్మిస్తుంది. నరనారసింహా క్షేత్రాలైన యాగంటి, అలంపూర్, బెల్లంకొండ, శ్రీశైల ప్రాంతాలలో ఉన్న మహానిధులను బయటకు తీస్తారు. సూర్య నంది భూకంపంతో నేలమట్టమవుతుంది. బ్రాహ్మణుల పంచాంగం తలకిందలవుతుంది. వారు చెప్పే భవిష్యత్తు జరగదు. రేపల్లె చెట్లకు నిచ్చెన వేసుకుని ఎక్కి పరిమాణంలో మనుషులు పుడతారు. కృష్ణానది వరదల్లో 14 నగరాలు కొట్టుకొని పోతాయి. కృష్ణానది నీరు కనకదుర్గ మాత ముక్కు   పుడకను అంటుకుంటుంది. శ్రీశైల మల్లికార్జున గుడిలో పొగ మంటలు ఏర్పడతాయి. మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ప్రజలతో మాట్లాడతాడు. శ్రీశైల భ్రమరాంబిక గుడిలో ఒక ముసలి వచ్చి ఎనిమిది రోజులు ఉండి మేకల అరచి మాయమవుతుంది. మహా శివుని కంటి నుంచి నీరు కారుతుంది. బసవేశ్వరుడు రంగేలేసి కాలుదువ్వుతాడు.

పుట్ల కంభం మీద ప్రతిమా మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును. కంచి కామాక్షమ్మ ఉగ్రంతో దక్షిణ దేశ దొరలు, ప్రజలు నష్టపోతారు. రామేశ్వరం వద్ద భయంకరమైన యుద్ధం జరుగును. వినాయకుడు వలవల ఏడ్చును. దేవతలు ప్రత్యక్షమై ప్రజలతో నేరుగా మాట్లాడతారు. అమావాస్యనాడు ఉదయగిరి పర్వతం మీదనా విష్ణుమూర్తి విష్ణు చక్రంతో పాటు దర్శనమిస్తాడు. ఆరోజు చక్రంను చూసి చంద్రగ్రహణం అని ప్రజలు భ్రమపడతారు. ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తు విషయాలను వెల్లడించారు.

 

 

Related posts:

హ‌నుమాన్ జ‌యంతిని సంవ‌త్స‌రానికి రెండు సార్లు ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా..? ముస్లింలు 786 సంఖ్యను ఎందుకు అంతగా ఆరాధిస్తారో తెలుసా ? ఇంట్లో భార్య, భర్తలు ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలి? శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd