Advertisement
పెళ్లి అనేది నిండు నూరేళ్ల జీవనం. అయితే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదిరిచిన పెళ్లి అయినా, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం. అయితే మన పెద్దలను అడిగితే గొడవలు లేని సంసారం చాలా బోరింగ్ గా ఉంటుంది అంటుంటారు. కానీ ఈ మధ్య ప్రతి చిన్న గొడవకు భార్య భర్తలు విడాకుల వరకు వెళ్తున్నారు. అయితే, భార్య భర్తల మధ్య మనస్పర్ధలకు ప్రధాన కారణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
డిమాండ్ చేయడం మరి ఎక్కువగా కంట్రోల్ చేయడం వంటి లక్షణాలను ఎక్కువ కాలం భార్యలు భరించలేరు. ముఖ్యంగా ఇది రిలేషన్ లో ఉండకూడదు. కమాండింగ్, డిమాండింగ్ నేచర్ రిలేషన్ ని నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలాగే ఫైనాన్స్ విషయంలో మీ భాగస్వామి తన కోసం ఖర్చు చేసుకోవడానికి సరిగ్గా అనుమతించకపోవడం, అతిగా కంట్రోల్ చేయడం సరైన ఆలోచన కాదు. దీని వల్ల మీ రిలేషన్ పై వ్యతిరేకత పెరుగుతుంది. వాళ్లలో స్వతంత్రత కోల్పోయామన్న ఫీలింగ్ పెరుగుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలో మరి ఎక్కువగా కట్టడి చేయకూడదు.
Advertisement
ఈగో రిలేషన్ ని నాశనం చేసే వాటిల్లో అహం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రిలేషన్ లో కాంప్రమైజ్ అవడం కంటే ఈగోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా కామన్ గా కనిపిస్తున్న సమస్య. కాబట్టి మీ రిలేషన్ కు ఈగో అనేది సమస్య కాకుండా, జాగ్రత్త పడటం అవసరం. గౌరవించకపోవడం ఒకరినొకరు కామెడీ చేసుకోవడం కామన్. బావుంటుంది. కానీ, శారీరక హింస అనేది భరించలేనిది. అలాగే మీ భాగస్వామిని గౌరవించడం చాలా ముఖ్యమైన అలవాటు. గౌరవం కోల్పోయినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ ఈ సూత్రాలు పాటిస్తే జీవితాంతం హ్యాపీ లైఫ్ అనుభవించవచ్చు.
READ ALSO : ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఆ కలర్ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?