Advertisement
పెళ్లి అంటేనే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. నిండు నూరేళ్లు వారు కలకాలం జీవించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొత్తగా పెళ్లి అయిన వారు మొదట కొన్నాళ్లు ఓ కలల ప్రపంచం లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతాయి. దీనికి కారణం ఒకరిపైన ఇంకొకరికి అవగాహన తగ్గటం, అర్థం చేసుకోకపోవడమే. వివాహమైన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ జంట జీవితాంతం హ్యాపీ గా ఉంటుంది. అయితే కొంత మంది.. రిలేషన్ లోకి వెళ్ళి, పెళ్లి చేసుకుంటారు.
Advertisement
ఓ మనిషి పెళ్లి కాకుండానే రిలేషన్ లోకి అడుగు పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో శారీరక కోరికలు ఒకటి. ఇదొక బేసిక్ బయోలాజికల్ నీడ్. ఆకలి, దప్పిక, నివాసం ఎలాగో శారీరక అవసరం కూడా అంతే. మనకు పెళ్లి చేసుకోవటానికి ఓ నిర్దిష్ట వయసు ఉంది. ప్యూబర్టీ తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. హార్మోనల్ మార్పుల కారణంగా కోరికలు పెరుగుతాయి. 14 ఏళ్ల నుంచి ఇవి మొదలవుతాయి. అయితే ఆ కోరికలు తీర్చుకోవటానికి 21 ఏళ్ల వరకు ఆగాల్సి వస్తుంది. ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ఓ రిలేషన్ అవసరం అవుతుంది. తమ కోరికలను తీర్చుకోవటానికి బంధం లోకి అడుగు పెడతారు.
సైకలాజికల్ నీడ్:
ఆ ఏజ్ లో ముఖ్యంగా 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న టీనేజర్స్ కు చాలా కారణాలతో సైకలాజికల్ నీడ్స్ అవసరం అవుతాయి. ఇంట్లో వారు తమ బాధల్ని పట్టించుకోకపోవడం, ప్రేమగా చూసుకోకపోవటం వల్ల పక్కవాడికి లవర్ ఉంది. నాకు లేదు అన్న భావన వల్ల కూడా రిలేషన్ లోకి అడుగు పెడతారు.
Advertisement
ఆర్థిక అవసరాలు:
ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ తాజా పరిణామాలు చూసుకుంటే వాళ్ల చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇతరుల వద్ద పెద్దపెద్ద ఐఫోన్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద కార్లలో వస్తారు. మంచి బ్రాండ్ బట్టలు వేసుకుంటారు. బ్రాండ్ కళ్ళజోడు పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. లోపల ఎక్కడో ఇన్ ఫిరియారిటీ కలుగుతుంది. నాకు కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి టైం లో ఈజీగా పడిపోతారు. బహుమతులు ఇవ్వటం అన్నది ఇక్కడ ప్రధానం. ఫారన్ కంట్రీస్ లో షుగర్ డాడీ, షుగర్ మమ్మీ అని ఉంటారు. వాళ్ళు తమకంటే తక్కువ వయసున్న వారితో సంబంధాలు పెట్టుకుంటారు. అందుకు ప్రతిఫలంగా డబ్బులు, ఆస్తులు, బహుమతులు ఇస్తుంటారు. ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే ఇండియాలోకి అడుగు పెట్టింది.
సోషల్ నీడ్:
ఇది కొంత మనకు నవ్వు తెప్పిస్తుంది. కొంతమంది యువతి, యువకులు పక్కవారిని చూసి బంధం లోకి అడుగుపెడుతుంటారు. ఇక్కడ నాకు ఒక లవర్ ఉన్నాడు లేదా ఉంది అని చెప్పుకోవటమే గొప్ప. ఇక్కడ భాగస్వామి ఉండటమే పెద్ద డ్రీమ్ కేవలం ఈ కారణంతోటే కొంతమంది రిలేషన్ లోకి అడుగు పెడుతున్నారు. తమ పక్కన ఓ వ్యక్తి ఉండటాన్ని గొప్ప విషయంలా భావిస్తుంటారు.
READ ALSO : T20 WC 2022 : టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్