Advertisement
భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని చెబుతారు. అయితే భార్య తన భర్తకు చెప్పని నాలుగు రహస్యాల గురించి తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఆచార్య చాణక్య అవేమిటో తెలియజేశారు. ఈ రహస్యాల కారణంగా భార్యాభర్తల ప్రేమ మరింత బలంగా ఉంటుందని కూడా ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఏకపక్ష ప్రేమ:
ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం స్త్రీలలో ఏకపక్ష ప్రేమ ఉంటుందని తెలిపారు. స్త్రీ ఎవరినైనా ఇష్టపడితే ఏకపక్షంగా ప్రేమిస్తుందని చెప్పారు. అయితే ఈ రహస్యాన్ని ఆమె భర్త ముందు బహిరంగపరచదట. ఆమె తన జీవితాంతం ఈ రహస్యాన్ని తనలోనే దాచుకుంటుందని చాణక్య తెలిపారు.
డబ్బు ఆదా:
Advertisement
భార్య ఇంటికి మహాలక్ష్మి అని ఆచార్య చాణక్యడు తెలిపారు. ఆర్థిక కుంగుబాటు సమయాల్లో ఇంటిని చక్కదిద్దడంలో వారు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. ఖర్చులకోసం భర్త ఇచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని భార్య పొదుపు చేస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ బయట పెట్టదట. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ రహస్యం వెళ్లడవుతుందని ఆచార్య చాణక్య తెలిపారు.
వ్యాధుల విషయంలో:
ఆచార్య చాణక్య పేర్కొన్న దాని ప్రకారం స్త్రీలు తమ జబ్బుల విషయాన్ని భర్తల దగ్గర దాస్తుంటారు. భర్తను అనవసరంగా ఇబ్బంది పెడతామేమోనని వారు ఇలా చేస్తుంటారని చాణక్య తెలిపారు. అయితే వ్యాధులను గోప్యంగా ఉంచడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చాణక్య తెలిపారు.
also read; ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?