Advertisement
సినిమా వాళ్ళకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది సినీ తారలు, రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో మన తెలుగు నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టడం మామూలు విషయం కాదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది ఎన్టీఆర్ కు సమకాలిన నటుడు ఎంజి రామచంద్రన్ కూడా అక్కడ తన ప్రభావం చూపించి రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు.
Advertisement
జయలలిత కూడా దాదాపు 13 ఏళ్లు సీఎం గా చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రాజకీయాల్లో కూడా రానించి సినిమా వారి విలువేంటో నిరూపించారు. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చేయి కాల్చుకున్నారు. కేవలం 18 స్థానాలు గెలుచుకున్న తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్లీ సినిమాల వైపు వెళ్లారు.
Advertisement
ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం 2014లో జనసేన పార్టీ స్థాపించిన ప్రజల్లో ప్రాచుర్యం పొందలేదు. ఫలితంగా ఓటమి చవిచూసినా ప్రస్తుతం ఏపీలో తన ప్రభావం చూపించాలని తాపత్రయ పడుతున్నారు.
ఇంకా వేరే కాకుండా తమిళంలో కమల్ హాసన్ కూడా గత ఎన్నికల్లో పార్టీ స్థాపించి పోటీలో నిలిచిన ఎక్కడా కూడా విజయం సాధించక దుకాణం మూసుకున్నారు. ఇదే కోవలో విజయకాంత్, కార్తీక్, విజయ్ లాంటి వారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఫెయిల్ అయ్యారు. కానీ సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!