Advertisement
ఇప్పటికే 2022 వ సంవత్సరం సగం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం సినిమాలకు కలిసొచ్చింది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా రిలీజ్ కు దూరంగా ఉన్నటువంటి సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో భారీ అంచనాలతో ఊరించిన పెద్ద పెద్ద సినిమాలు కూడా బయటకు వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇంకా కొన్ని రిలీజ్ కావలసినటువంటి మూవీలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 2022లో ఫస్టాప్ లో అంటే జనవరి నుంచి జూన్ 30 వరకు విడుదలైన సినిమాల్లో బాక్సాఫీస్ షేక్ చేసినవి ఏంటో ఒకసారి చూడండి..!
బంగార్రాజు :
నాగార్జున నాగచైతన్య కాంబినేషన్ లో సోగ్గాడే చిన్నినాయన అనే మూవీ కి సీక్వెల్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన బంగార్రాజు మూవీ జనవరి 14 వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద హిట్ గా నిలిచింది .
Advertisement
డీజే టిల్లు :
విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 12 న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.
భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో మలయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకొని మొదటి నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ చివరికి అబో ఆవరేజ్ గా నిలిచింది.
ఆర్ ఆర్ ఆర్ :
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా మార్చి 25న విడుదలై ఇండియా మొత్తంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ మూవీ. తెలుగు ఇండస్ట్రీలో అయితే ఒక సంచలనం సృష్టించింది అని చెప్పవచ్చు.
Advertisement
సర్కారు వారి పాట :
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మే 12వ తేదీన రిలీజ్ అయింది.నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. అయినా చివరికి బాక్సాఫీస్ వద్ద హిట్టు గా నిలిచింది.
ఎఫ్3 :
అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ మూవీ మే 27న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంది.
మేజర్ :
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అడివి శేష్ హీరోగా జూన్ 3వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2:
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా ఏప్రిల్ 14 వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ భారతదేశం మొత్తం లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
విక్రమ్ :
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3వ తేదీన రిలీజ్ అయ్యి సక్సెస్ అయింది. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
also read;
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..!