Advertisement
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సినిమాలు తగ్గించిన సమంత, నాగచైతన్యతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ ట్రెండింగ్ అవుతుంది. ఎక్కువగా బోల్డ్ గా పలు సినిమాలలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సమంత ఆరోగ్యం పై గత కొద్ది రోజులుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై సమంత స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
Advertisement
Read also: కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే!
ఈ ఫోటోలో సమంత చేతికి సెలైన్ ఉండడం గమనార్హం. ” యశోద ట్రైలర్ కు మీ స్పందన చాలా బాగుంది. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జీవితం ముగింపు లేని సవాళ్లను నా ముందు ఉంచింది. గత కొన్ని నెలల నుంచి ” మయోసైటిస్” అనే ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నాను. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నాను. అనుకున్నంత వేగంగా ఈ చికిత్స పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యు”. అని సమంత ట్వీట్ చేసింది.
Advertisement
అయితే సమంత ఎదుర్కొంటున్న ఆటో ఇమ్యూన్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నిపుణులు తెలిపిన ప్రకారం..ఇది కండరాలకు సంబంధించిన సమస్య. అయితే కండరాలలో నిరంతర బలహీనత కారణంగా వారి సామర్థ్యం పై ప్రభావం పడి కూర్చోవడం, లేదా నడవడం చాలా కష్టంగా మారుతుంది. ముఖం మీద దద్దుర్లు రావడం, చర్మం ఎర్రబడడం, పొలుసులు రావడం వంటి లక్షణాలు ఎక్కువగా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తాయి. బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సమస్యతోనే సమంత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.