Advertisement
ఇంటికి దీపం ఇల్లాలు అంటుంటారు పెద్దలు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాంటి ఇల్లాలు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇంట్లో ఆడవాళ్లు చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఆడవాళ్లు వంట గదిలో ఇలా గనుక చేస్తే అష్ట దరిద్రాలు పట్టుకుని అప్పుల పాలై పోతారని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతున్నారు. మరి ఆడవారు వంటగదిలో చేయకూడని కొన్ని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వంటింట్లో తల దువ్వుకోవడం, గోర్లు తీయడం వంటివి ఎప్పటికీ చేయకూడదు. వంటింట్లో తల దువ్వుకున్నట్లయితే ఆ వెంట్రుకలు ఆహారంలో పడే ప్రమాదం ఉంది.
Advertisement
Read also: ఆ ఒక్క కారణం తోనే తమ సినిమాల్లో నటించడానికి సమంతని మన తెలుగు హీరోలు వద్దు అని అనుకుంటున్నారా?
Advertisement
భోజనంలో వెంట్రుకలు వస్తే ఆ ఇంట్లో రోగాలు ఎక్కువ అవుతాయట. చాలామంది ఆహారంలో వెంట్రుకలు వస్తే వాటిని తీసేసి మిగిలిన దాన్ని తినేస్తుంటారు. అయితే అలా వెంట్రుకలు కనిపించినప్పుడు వాటిని తీసేసి తినడానికి బదులు ఆ భోజనాన్ని జంతువులకు దానం చేయడం మంచిదట. ఇలా వెంట్రుకల పడిన ఆహారాన్ని తినడం వల్ల అది జీర్ణం కాదు. అలాగే వంటింట్లో జుట్టు విరబోసుకుని కూడా తిరగకూడదు. ఇక వంట చేసేవారు శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. అలాగే వంట చేసేటపుడు తినే వాళ్ళ మీద ప్రేమతో చేయాలి.
కానీ ఏదో అలా చేసేద్దాం లే, అసలు నా కర్మ కాలి వంట చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. ఇక ధర్మశాస్త్రం ప్రకారం, మనం భోజనం చేసే సమయంలో ఎవరైనా వీరు భోజనం చేసే ప్లేటు నుండి దాటితే.. పొరపాటున కూడా ఆహారాన్ని తినకూడదు. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే పాపం వస్తుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మరిచిపోవద్దు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం”.. అంటే అన్నం దేవుడితో సమానమని. దాని ఊరికే వృధా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
Read also: వరసకు అన్న చెల్లెల బంధం ! కానీ పెళ్లి చేసుకున్నారు .. అసలు విషయం తెలిసాక ఏమయ్యిందంటే ?