Advertisement
కరోనా పాండమిక్ టైంలో థియేటర్స్ లో తమ సినిమాలను విడుదల చేయలేని నిర్మాతలకు ఓటీటీ అనేది ఓ వరంలా మారింది. ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్స్ కి వెళ్లేవారు.. ఇప్పుడు కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చుని తమ పర్సనల్ స్క్రీన్ మీద ఓటీటీలలో చూసేస్తున్నారు. థియేటర్స్ గురించి ఆలోచించకుండా చాలా సినిమాలు ఓటీటీలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కొద్ది రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక థియేటర్లలో విడుదలై ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 సినిమాలు ఏవో తెలుసుకుందాం..
Advertisement
Read also: ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు
1) కార్తికేయ 2: ఈ సినిమా జి5 లో స్ట్రీమింగ్ అవుతుంది. మిస్టరీ త్రిల్లర్ మూవీగా కృష్ణతత్వం జోడించి తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
2) విక్రమ్: ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విశ్వ నటుడు కమల్ హాసన్ కం బ్యాక్ హిట్ ఇచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా కట్టుకుంటుంది.
3) తిరు: ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా థియేటర్లలో అద్భుత విజయాన్ని సాధించింది.
4) సీతారామం: ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాను ఇంకా చూడకపోతే చూసేయండి.
Advertisement
5) విక్రాంత్ రోనా: ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ని మిస్ అవ్వకండి.
6) కోబ్రా: ఈ సినిమా సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను ఇంకా చూడకపోతే చూసేయండి.
7) 777 చార్లీ: ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను మిస్ కాకండి.
8) లాల్ సింగ్ చడ్డా: ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను ఇంకా చూడకపోతే చూసేయండి.
9) గార్గి: ఈ చిత్రం సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ ఎమోషనల్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
10) వలసపూడి వీరబాబు: ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరో కార్తీ నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను ఇంకా చూడకుంటే చూసేయండి.
Read also: గాయాల కారణంగా IPL, T20 ప్రపంచ కప్ దూరం అయిన ప్లేయర్లు !