Advertisement
ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ దర్శకుడిగా మన ఎస్ఎస్ రాజమౌళి ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “స్టూడెంట్ నెంబర్ 1” సినిమాతో ప్రారంభమైన రాజమౌళి కెరియర్.. ఇప్పుడు బాహుబలి, R.R.R చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. తొలి సినిమాతోనే రాజమౌళి ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం అతి తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ.. అప్పట్లో 14 కోట్ల రూపాయల షేర్ వరకు రాబట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రాజమౌళి తీసే తర్వాత సినిమాపై మనకంటే దేశంలో ఎక్కువగా ఆసక్తిగా ఉంది.
Advertisement
ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా అత్యంత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరపైకి రాబోతుందని సమాచారం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా యదార్ధ సంఘటనల సమూహారంగా తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం. దాదాపు 20 ఏళ్లుగా ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేకుండా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ఈయనతో సినిమా చేయడానికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం క్యూ కడతారు.
Advertisement
కానీ ఒకప్పుడు ఆయన తీయాలనుకున్న రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అవి ఏంటంటే.. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం తర్వాత మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ఓ మైథిలాజికల్ డ్రామా మూవీని తీయాలని అనుకున్నారట. కానీ ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన గురువు రాఘవేంద్రరావు కుమారుడు సూర్యప్రకాష్ తో ఓ భారీ బడ్జెట్ లవ్ స్టోరీ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీనికి భారీ బడ్జెట్ ఏ కారణమని.. పైగా సూర్యప్రకాష్ తనన తొలి సినిమా “నీతో” ఫ్లాప్ కారణంగా భారీ బడ్జెట్ అంటే కుదరలేదు. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మరో సినిమా “సింహాద్రి”ని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
Read also: సమంతను వేధిస్తున్న వ్యాధి లక్షణాలు ఇవే..!!