Advertisement
చాలావరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవుతుంటాయి. వందలో ఐదు, పది సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. కొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ సాధిస్తుంటే, మరోవైపు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి. మరికొన్ని చిత్రాలు మంచి ఫీల్ గుడ్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశ పరుస్తూనే ఉంటాయి. అలా నిరాశపరిచిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
# ఆచార్య:
చిరంజీవి-రామ్ చరణ్-కొరటాల శివ ఈ కాంబినేషన్ అనగానే డే వన్ నుండి టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు మోగిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ, మొదటి రోజు ఈవినింగ్ షో లకే థియేటర్లలో జనాలు లేరు. అంటే ఈ మూవీ ఏ రేంజ్ లో నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు.
# పక్కా కమర్షియల్:
గోపీచంద్-మారుతి, మూవీ క్రియేషన్స్-గీత ఆర్ట్స్, ఈ కాంబినేషన్లో సినిమా అనగానే బ్లాక్ బస్టర్ తప్ప మరో ఆలోచన మైండ్ లోకి రాదు. కానీ సినిమా ఆ స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
# రామారావు ఆన్ డ్యూటీ:
టైటిల్ అనౌన్స్మెంట్ నుండే భారీ హైప్ ను సొంతం చేసుకున్న మూవీ ఇది. రవితేజ సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.
# ది వారియర్:
రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం, దానికి లింగు స్వామి దర్శకుడు కావడం, సినిమా సూపర్ హిట్ అని అంతా అనుకున్నారు. తమిళ్ లో కూడా రామ్ కు మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా ఆ స్థాయిలో లేదు.
# థాంక్యూ:
Advertisement
విక్రమ్ కుమార్ దర్శకుడు, నాగచైతన్య హీరో, ఇది ‘మనం’ కాంబినేషన్. పైగా దిల్ రాజు నిర్మాత. సినిమా మినిమం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ మొదటి షోకే డిజాస్టర్ రిజల్ట్ ను మూట కట్టుకుంది.
# లైగర్:
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబో. పైగా పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత. సినిమా బ్లాక్ బస్టర్ అని టైటిల్ అనౌన్స్మెంట్ నుండి అనుకుంటూనే ఉన్నాం. కానీ తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది ఈ మూవీ.
# చెక్:
నితిన్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. కానీ సినిమా ఆ స్థాయిలో లేకపోవడంతో రెండో రోజు దుకాణం సర్దేసింది.
# చావు కబురు చల్లగా:
‘ఆర్.ఎక్స్.100’ హీరోకి ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ లో ఓ సూపర్ హిట్ పడుతుంది అని ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటికీ నుండి హోప్స్ పెరిగాయి. కానీ దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రిలీజ్ రోజున అవన్నీ అపోహలే అని ప్రూవ్ చేశాడు.
# మహాసముద్రం:
‘ఆర్.ఎక్స్.100’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. శర్వానంద్-సిద్ధార్థ్ లతో ఓ సినిమా చేస్తున్నాడు అంటే సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. కానీ ఆ స్థాయిలో అయితే సినిమా లేదు. అందుకే డిజాస్టర్ అయ్యింది.
# కిలాడి:
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘కిలాడి’. ఫస్ట్ లుక్ నుండే భారీ అంచనాలు పెంచిన ఈ మూవీ రిలీజ్ రోజున మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది.
Read Also : భార్య భర్తలు 5 మార్పులు కనిపిస్తే మరోకరితో ప్రేమలో ఉన్నట్టేనట? అవేంటంటే?