Advertisement
Chanakya Niti : ఆచార్య చాణక్య అనేక విషయాల గురించి మాట్లాడారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఎంతో అద్భుతంగా జీవితాన్ని మార్చుకోవడానికి అవుతుంది. ఆచార్య చాణక్య గొప్ప పండితుడు అలానే జ్ఞానవంతుడు కూడా. చాణక్య చంద్రగుప్త మౌర్యుని యొక్క గురువు. చాణక్య నీతి అని పిలవబడే నీతి శాస్త్రాన్ని చాణిక్య రచించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితాన్ని చాలా అందంగా అద్భుతంగా మార్చుకోవడానికి అవుతుంది. చాణక్య ఈ అలవాట్లు ఉన్నట్లయితే జీవితంలో ఫెయిల్ అవుతారు అని అన్నారు పైగా ఈ అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరూ కూడా ఉండరు అని చాణక్య అన్నారు.
Advertisement
మరి చాణక్య చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.. ప్రజలు వాళ్ళు చేసే తప్పులను మర్చిపోయి ఇతరుల తప్పులు మీద దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటారు. మీ చుట్టూ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి దూరంగా ఉండటం మంచిది. ఎప్పుడూ కూడా మనం శుభ్రమైన వాతావరణంలో ఉండాలి మన చుట్టూ మురికిగా ఉంటే మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అపరిశుభ్రమైన చోట లక్ష్మీదేవి ఉండదు.
Advertisement
Also read:
Also read:
96 మూవీలో జాను స్నేహితురాలిగా చేసిన అమ్మాయి.. ఎంత అందంగా ఉందో చూసారా..?
కాబట్టి ఎప్పుడూ స్వచ్ఛతను పరిశుభ్రతని పాటించాలి అలానే మనం ఎప్పుడూ కూడా నిజాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎల్లప్పుడూ కష్టాలు ఎదుర్కొంటారు. అబద్దాలు చెప్పడం వలన మనం గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది ఎప్పుడూ మనం చురుకుగా పనిచేయాలి. బద్దకంగా ఉండకూడదు బద్ధకంగా ఉంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాలి. చాణక్య నీతి ఎప్పుడూ కూడా అత్యాశ మంచిది కాదని చెప్తోంది. అత్యాశ దురాశ రెండు కూడా మంచివి కావు ఈ కారణంగా మనం కష్టాలని అగౌరవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!