Advertisement
మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే రోజంతా ఉల్లాసంగా ఉండడానికి ఈ విషయాలని కనుక పాటించారంటే కచ్చితంగా రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఇలా చేయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే రాత్రులు వేగంగా నిద్ర పోవాలని నిపుణులు చెప్తున్నారు. అలానే మంచి నాణ్యమైన నిద్ర ఉండాలని అన్నారు. సరైన నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని.. కచ్చితంగా ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని నిపుణులు అంటున్నారు.
Advertisement
రాత్రి త్వరగా నిద్రపోయి త్వరగా నిద్ర పోయి, ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం వలన శరీరం మనసు రీఛార్జ్ అవుతుందని అన్నారు. అలాగే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాసేపు సూర్యకాంతిలో ఉండాలి. దీని వలన కండరాలను బలోపేతం చేయడానికి మెదడును పదునుపెట్టడానికి విటమిన్ డి అందుతుందని చెప్పారు. రోజంతా హుషారుగా ఉండాలంటే డిహైడ్రేషన్ కి గురవకుండా ఉండాలని శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవాలని చెప్పారు.
Advertisement
Also read:
ఉదయం లేచిన వెంటనే కచ్చితంగా తేలికపాటి వ్యాయామం యోగా చేయడం మంచి అలవాటు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలు చురుకుగా ఉంటాయి. దీంతో రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. అల్పాహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఫైబర్ తో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తీసుకోండి. ఇది శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. ఆలోచనతో ప్రారంభించాలి ఏదైనా పని చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. పాజిటివ్ థింకింగ్ గా మారుస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!